BRS Party: తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని దూషిస్తూ చేసిన ప్రసంగాన్ని కేటీఆర్ ఖండించారు. ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నియామకం చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ అనుబంధం తెలిసివస్తోందని, వారిద్దరిదీ ఫెవికాల్ బంధమంటూ వ్యాఖ్యానించారు.
Dragged Student: ఓ విద్యార్థినిపై మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు దారుణంగా ప్రవర్తించారు. వాహనం వెళ్తున్న కానిస్టేబుళ్లు యువతి జట్టు పట్టుకుని లాగారు. ఫలితంగా ఆ యువతి కిందపడిపోయింది. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సంఘటనను ఖండించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Transfers and Postings: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికార యంత్రాంగాన్ని సర్దుబాటు చేసుకుంటోంది. ఇటీవల పలుమార్లు ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. తాజాగా దావోస్ పర్యటన అనంతరం మరోసారి అధికార యంత్రాంగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మరికొందరు ఐఏఎస్‌లను బదిలీ చేసింది.
Telagana Radar Station: భారత నావికా దళానికి తెలంగాణ మరో విశిష్ట సేవలు అందించనుంది. నౌకలు, జలాంత్గరాములకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం తెలంగాణలో ఒక రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుంది. దశాబ్దా కాలంగా కొనసాగుతున్న ఈ స్టేషన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. భూముల కేటాయింపు, నిధుల చెల్లింపు ప్రక్రియకు పీటముడి వీడింది. 2027లో ఈ కేంద్రం అందుబాటులోకి రానుండడం విశేషం.
Fight in Social Media: హామీలపై ప్రశ్నిస్తే 'చెప్పుతో కొట్టాలి' అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయలని కాంగ్రెసోళ్లను ఏ 'చెప్పు'తో కొట్టాలని ప్రశ్నించారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ సభలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
High Alert in BRS Party: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం కావడం కలకలం రేపింది. ఈ సమావేశం గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. ఆ పార్టీలో చీలిక మొదలైందా..? కాంగ్రెస్‌తో టచ్‌లోకి వచ్చారా అనేది చర్చ జరుగుతోంది.
Congress Gain Two MLCs: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మరో అదనపు లాభం కలిగింది. శాసనసభలో అత్యధిక స్థానాలు గెలిపొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలోనూ బలం పెరిగింది. తాజాగా జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు హస్తం ఖాతాలో చేరాయి. బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు అయ్యారు.
General Elections: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన కారు రిపేర్ కోసం సర్వీసింగ్‌కు వెళ్లిందని.. లోక్‌సభ ఎన్నికలతో యమస్పీడ్‌తో దూసుకొస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. విద్యుత్ బిల్లులు బరాబర్ చెల్లించవద్దని ప్రజలకు చెబుతామని స్పష్టం చేశారు. బిల్లులన్నీ సోనియాగాంధీ ఇంటికి పంపిస్తామని స్పష్టం చేశారు.
London Tour: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి విదేశాల్లో ప్రత్యేకత చాటుతున్నారు. దావోస్ సదస్సును విజయవంతం చేసి పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతమైన రేవంత్ రెడ్డి అనంతరం లండన్‌లో కూడా మెరిశారు. ప్రభుత్వ పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ దేశంలో రేవంత్ అరుదైన గౌరవం పొందారు. ప్రఖ్యాత ప్యాలెస్‌లో ఆయన ప్రసంగం చేశారు.
How To Get E-KYC Gas Distribution: E-KYC గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇక గంటల తరబడి ఏజెన్సీల వద్ద భారీ క్యూలు కట్టవలసిన అవసరం లేదని రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులకు రావొద్దని కోరారు. మీరు E-kyc పొందాలంటే డెలివరీ బాయ్స్ వద్ద ఉన్న ప్రత్యేక యాప్ ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేశారు. మరి కొన్ని వివరాలు ఇలా..
Free Bus Journey in Telangana: తెలంగాణలో రేపటి నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించింది. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.