Agriculture University: తెలంగాణ ప్రభుత్వం కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయించిన వంద ఎకరాల భూమికి వ్యతిరేకంగా వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. కొన్ని వారాలుగా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ యూనివర్సిటీ భూములు హైకోర్టుకు కేటాయించవద్దని డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతున్నది. అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల భూములను హైకోర్టుకు కేటాయిస్తూ జారీ చేసిన జీఓ నంబర్ 55ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
The recent incident involving Telangana police is deeply concerning and absolutely unacceptable. Dragging a peaceful student protester and unleashing abrasive behaviour on the protestor raises serious questions about the need for such aggressive tactics by the police.
This… pic.twitter.com/p3DH812ZBS
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 24, 2024
జీవో 55కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీస్ కానిస్టేబుళ్ల స్కూటీపై వెళ్తూ ఆ విద్యార్థిని వెంబడించారు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. విద్యార్థి కిందపడడంతో గాయాలయ్యాయి. అనంతరం పోలీసులతో ఆ విద్యార్థిని వాగ్వాదానికి దిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన మహిళా కానిస్టేబుళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందరూ ఈ సంఘటనను ఖండిస్తున్నారు. కాగా ఆ యువతి ఏబీవీపీకి చెందిన కార్యకర్తగా తెలుస్తోంది.
కవిత ఖండన
ఈ సంఘటనపై బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 'ఎక్స్' ద్వారా డిమాండ్ చేశారు. 'తెలంగాణ పోలీసులకు సంబంధించిన తాజా సంఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషం. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నిరసన చేపడుతున్న విద్యార్థినిని ఈడ్చుకెళ్లడం, నిరసనకారులపై అసభ్యంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. ఈ దురహంకార ప్రవర్తనకు తెలంగాణ పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. మానవ హక్కుల సంఘం ఈ సంఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ దారుణ సంఘటనను అందరూ ముక్తకంఠంతో ఖండించాలి' అని కవిత పిలుపునిచ్చారు.
Also Read: MLA vs Chiarperson: ఎమ్మెల్యే దాదాగిరిపై తిరగబడ్డ మహిళా చైర్మన్.. 'ఎమ్మెల్యే చెప్తే లేచి నిలబడాల్న?
Also Read: JanaSena Party: జనసేనకు డబుల్ బొనాంజా.. జానీ మాస్టర్, పృథ్వీ చేరిక.. గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook