Revanth Reddy London Tour: లండన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం.. విఖ్యాత ప్యాలెస్‌లో ప్రసంగం

London Tour: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్‌ రెడ్డి విదేశాల్లో ప్రత్యేకత చాటుతున్నారు. దావోస్‌ సదస్సును విజయవంతం చేసి పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతమైన రేవంత్‌ రెడ్డి అనంతరం లండన్‌లో కూడా మెరిశారు. ప్రభుత్వ పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ దేశంలో రేవంత్‌ అరుదైన గౌరవం పొందారు. ప్రఖ్యాత ప్యాలెస్‌లో ఆయన ప్రసంగం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2024, 10:47 PM IST
Revanth Reddy London Tour: లండన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం.. విఖ్యాత ప్యాలెస్‌లో ప్రసంగం

Revanth Reddy UK Tour: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం దావోస్‌ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అటు నుంచి లండన్‌ వెళ్లారు. అక్కడ రేవంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్‌లో ఆయన ప్రసంగం చేసి ఆకట్టుకున్నారు. లండన్‌లో భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులతో రేవంత్‌ సమావేశమయ్యారు. గురువారం జరిగిన ఈ భేటీలో రేవంత్‌ రెడ్డి భారతదేశ విశేషాలు, తెలంగాణలో తాజాగా జరిగిన పరిణామాలు వివరించారు. అనంతరం హాజరైన అతిథులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘భారత్, బ్రిటన్ మధ్య బలమైన బంధం ప్రజాస్వామ్యమే' అని చెప్పారు. ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరం అని గుర్తు చేశారు. 

అక్కడి లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ, మరో ఏడుగురు ఎంపీలతోపాటు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. 'నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కుల హరణ, ప్రజాస్వామ్యంపై దాడి.. వంటి వాటికి విరుగుడు ప్రజాస్వామ్యం పటిష్టం చేయడమే. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం ద్వారానే సవాళ్లకు పరిష్కారం లభిస్తుంది. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలను శక్తిమంతులను చేయటమే అసలైన పరిష్కారం' అని తెలిపారు. 

ఈ సందర్భంగా బ్రిటన్‌తో భారత్‌కు ఉన్న సంబంధాలను రేవంత్‌ రెడ్డి గుర్తు చేశారు. బ్రిటన్‌, భారత్‌ మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘ఒకప్పుడు మీ దేశం మా దేశాన్ని పరిపాలించింది. మా కాంగ్రెస్ పార్టీనే మీకు వ్యతిరేకంగా పోరాడింది. అప్పుడు మహాత్మా గాంధీ ఎంచుకున్న సత్యం, అహింస, న్యాయ పోరాటమే మీ దేశానికైనా.. మా దేశానికైనా ఇప్పటికీ మార్గదర్శకం' అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తాను ఈ స్థాయికి రావడానికి వెనుక ఉన్న కృషి, తన జీవిత నేపథ్యాన్ని సీఎం వివరించారు. తాను గ్రామీణ ప్రాంతంలోని సాధారణ రైతు బిడ్డను అని రేవంత్‌ రెడ్డి చెప్పుకున్నారు. కేవలం ప్రజాస్వామ్యం వల్లనే తాను ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, పార్టీ ఎంచుకున్న ప్రజాస్వామ్య భావనతోనే తనకు ఇంతటి అవకాశం ఇచ్చిందని వెల్లడించారు. దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందే అవకాశాలు అసలైన ప్రజాస్వామ్యం ద్వారానే సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.

ప్యాలెస్‌ ప్రత్యేకత
లండన్‌లో రేవంత్‌ రెడ్డి హాజరైన సమావేశం భవనం పేరు వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్‌. శతాబ్దాల నాటి ఈ భవనానికి ఎంతో చరిత్ర ఉంది. 1016 సంవత్సరంలో నిర్మించిన ఈ భవనం ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలిచింది. ఈ ప్యాలెస్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక భవనంలోనే ఈ సమావేశం విశేషం. ఈ భవనంలో జరిగిన సమావేశంలో రేవంత్‌ రెడ్డి ప్రసంగించడం ప్రత్యేకంగా నిలిచింది.

Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

Also Read: Boat Accident: గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం 16 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News