Supreme Court collegium recommends new chief justices : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. దేశంలోని పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల బదిలీపై కొలీజియం ఇటీవల ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Saidabad girl's rape and murder case accused Raju's suicide case: హైదరాబాద్: సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నప్పటికీ.. రాజుది ఆత్మహత్య కాదు, అతడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టుకు (TS High court) ఫిర్యాదు చేశారు.
TS Govt to File Petition on Vinayaka Nimajjanam: దీంతో వేలాది విగ్రహాల గురించి, భక్తుల మనోభావాలపై అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లాలని సమీక్షలో నిర్ణయించారు. వాస్తవ పరిస్థితులను మొత్తం సుప్రీంకోర్టుకు వివరించాలని, నిమజ్జనానికి అనుమతి కోరాలని సమావేశంలో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Telangana High court on Ganesh chaturthi 2021: గణేష్ చతుర్థి ఉత్సవాల్లో (Ganesh Chaturthi 2021) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని హై కోర్టు స్పష్టంచేసింది.
Telangana High court slams Telangana govt: రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి విషయంలో ప్రస్తుత పరిస్థితులపై విచారణ సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై కోర్టు మండిపడింది. పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ సంఖ్యలో కేసులు (COVID-19 cases) పెరిగిపోతుండటం గమనించిన తర్వాతైనా మేలుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది.
రేపటి నుండి తెలంగాణాలో ప్రారంభం కానున్నస్కూల్స్ రీఓపెన్ పై హై కోర్టు స్టే విధించింది. . ప్రైవేట్ స్కూల్ టీచర్ బాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
Supreme Court: సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల నియామకం జరిగింది. సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తిగా తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ హిమకోహ్లి నియామకమయ్యారు. తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి నియామకం జరగనుంది.
Telangana High Court: దళిత బందు పథకంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటీషన్‌పై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. జాబితా ప్రకారమే విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.
PIL filed against Dalita Bandhu scheme: దళిత బంధు పథకంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడే దళిత బంధు పథకం అమలు చేయడాన్ని సవాలు చేస్తూ ఈ పిల్ దాఖలైంది.
Mariyamma lockup death case, Addaguduru cops dismissed: యాదాద్రి భువనగిరి: అడ్డగూడూరు పోలీసు స్టేషన్ లో లాకప్ డెత్‌కు గురైన మరియమ్మ కేసులో ఆమె చావుకు కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై మహేష్‌తో పాటు రషీద్, జానయ్య అనే మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై శాశ్వతంగా వేటు పడింది.
Telangana high court comments on Schools reopening: హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తి ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకముందే జులై 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో (Telangana high court) నేడు విచారణ జరిగింది. పాఠశాలల పునఃప్రారంభం విషయంలో హై కోర్టు ప్రశ్నలకు ప్రభుత్వం తరపున విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు.
B Janardhan Reddy Appointed As TSPSC Chariman: టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్)ను నియమించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. కమిషన్ సభ్యులను సైతం సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Lockdown extended in Telangana: హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించనున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ముందుగా తెలంగాణలో మే 12 నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
Raghuramakrishnam raju: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యేక జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు జరుగుతున్నాయి.
Telangana COVID-19 latest health bulletin: హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 62,591 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 3,961 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో 30 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Telangana Government Not Allows AP Ambulances | వరుసగా మూడో రోజు సైతం ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కరోనా పేషెంట్ల అంబులెన్స్‌లను పోలీసులు నిలిపివేస్తున్నారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది.
No Entry for Ambulance: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. సరిహద్దుల్లో అంబులెన్స్‌ను ఇంకా అడ్డుకుంటున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రోగి బంధువులతో గంటల తరబడి వాగ్వాదం కొనసాగుతోంది.
Don’t stop ambulances entering Telangana: TS High Court హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపేస్తున్నారనే అంశాన్ని తెలంగాణ హై కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను ఆపడం అంటే అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అభిప్రాయపడిన హైకోర్టు... సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా ? అని ప్రశ్నించింది.
Telangana Lockdown: కరోనా మహమ్మారి నియంత్రణకై తెలంగాణ రాష్ట్రం సైతం లాక్డౌన్ ప్రకటించింది. అయితే లాక్డౌన్ విధించకపోవడంపై ఆగ్రహించిన హైకోర్టు..హఠాత్తుగా లాక్డౌన్ ప్రకటనపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.
Telanagana Lockdown: కరోనా మహమ్మారి నియంత్రణకు మరో రాష్ట్రం లాక్డౌన్ బాటపట్టింది. దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తుండగా..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సైతం అమలు కాబోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.