Telanagana Lockdown: కరోనా మహమ్మారి నియంత్రణకు మరో రాష్ట్రం లాక్‌డౌన్ బాటపట్టింది. దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ అమలు చేస్తుండగా..ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సైతం అమలు కాబోతుంది.
తెలంగాణలో కరోనా వైరస్ (Corona Virus) కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అటు తెలంగాణ హైకోర్టు సైతం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటిస్తారా లేదా కఠిన ఆంక్షలు విధిస్తారా అనేది తేల్చాలని గడువు విధించింది.ఈ నేపధ్యంలో తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) భేటీ అయింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌పై సమీక్ష జరిపింది.రేపటి నుంచి లాక్‌డౌన్ అమలు చేసేందుకు నిర్ణయించింది.రేపటి నుంచి అంటే మే 12 నుంచి పదిరోజుల పాటు రాష్ట్రంలో కఠినమైన లాక్‌డౌన్ అమలు కానుంది. నిత్యావసరాల కోసం ప్రతిరోజూ నాలుగు గంటలు విరామం ఇచ్చింది ప్రభుత్వం. ప్రతి రోజూ ఉదయం 6 గంటల్నించి 10 గంటల వరకూ దైనందిన కార్యకలాపాల కోసం బయటకు వెళ్లడానికి అనుమతి ఉంది. మిగిలిన సమయాల్లో ఇంటికే పరిమితం కావల్సి ఉంటుంది.
లాక్‌డౌన్ (Lockdown) సమయంలో ఎవరెవరికి మినహాయింపు ఉండాలి, ఎవరికి ఉండకూడదు అనే విషయంపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ కాస్సేపట్లో విడుదల కానున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.
Also read: Black Fungus in Hyderabad: హైదరాబాద్‌లో బ్లాక్ ఫంగస్, కరోనా బాధితుల్లో ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook