72 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జె. జయలలిత డిసెంబర్ 5, 2016న మృతిచెందారు. నేటికి పురుచ్చితలైవి చనిపోయి ఏడాది అయ్యింది. కానీ ఇప్పటికీ ఆమె మరణానికి దారితీసిన పరిణామాలు మిస్టరీగానే ఉన్నాయి. జయలలిత మరణంపై ఈ ఏడాది పొడవునా ఎన్నో అనుమానాలు, ఆరోపణలు వచ్చాయి.
'ఓఖీ' తుఫాను క్రమేపీ బలహీన పడుతోందని.. అయినా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ విభాగం ఐఎండీ తెలిపింది. తుఫాను బలహీన పడుతున్నప్పుడు తీర ప్రాంతాలలో ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉందని పేర్కొనింది.
'ఓఖీ' తుఫాను దెబ్బకు తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకూడి, నాగపట్టినం జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. సముద్రంలో వేటకు వెళ్లిన 30 మంది మత్స్యకారుల జాడ కూడా కనిపించడం లేదు. ఇప్పటివరకు 'ఓఖీ' తుఫాను కారణంగా 12 మంది వరకు మృతి చెందారని అధికారులు తెలిపారు.
చెన్నైలో వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదు రోజులుగా ఎడతెరిపికుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం తడిసిముద్దయింది. కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడులోని ఆరు జిల్లాల్లో సుమారు 10 లక్షలకు పైగా ఇళ్లు నీట మునిగాయి, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా వర్ష తీవ్రత అధికమవుతోంది. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, కడలూరు, తిరువారూర్, నాగపట్టణం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిల్లో వర్షం అధికంగా పడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.