శ్రీలంకలో 27 మంది భారత జాలర్లు అరెస్టు

27 మంది భారత జాలర్లు అరెస్టు చేసినట్లు శ్రీలంక నావికాదళం తెలిపింది.

Last Updated : Dec 12, 2017, 03:17 PM IST
శ్రీలంకలో 27 మంది భారత జాలర్లు అరెస్టు

రామేశ్వరం (తమిళనాడు): డెల్ఫ్ట్ ఐలాండ్ సమీపంలో మంగళవారం ఉదయం శ్రీలంక నావికాదళం 27 మందిని భారత మత్స్యకారులను అరెస్టు చేశారు. వీరితో పాటు ఐదు పడవలను కూడా స్వాధీనం చేసుకున్నారు. జాలర్లు తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాకు చెందిన వారని అరెస్ట్ చేసిన అధికార వర్గాలు తెలిపాయి. ఈ మత్స్యకారులు అదుపులోకి తీసుకొని శ్రీలంకలోని కంకేసంటరై నావికా శిబిరానికి ఈ మత్స్యకారులు తరలించి విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Trending News