ప్రముఖ మైనింగ్ వ్యాపారవేత్త మరియు బీజేపీ నేత గాలి జనార్థనరెడ్డి బళ్లారి ప్రాంతానికి వెళ్లి తన సోదరుడు సోమశేఖర రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయలేరని సుప్రీంకోర్టు తెలిపింది.
ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న కట్టడం తాజ్మహల్. అటువంటి తాజ్ మహల్ రంగు వెలిసిపోయి రోజు రోజుకీ అందవిహీనంగా మారుతుందని.. పురాతన కట్టడాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందని.. ఈ విషయంపై వెంటనే వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలోని రసానా గ్రామంలో 8 ఏళ్ల బాలికను అతి దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఈ) 12వ తరగతి ఆర్థిక శాస్త్రం పేపర్ పరీక్షను మళ్లి నిర్వహించాలని నిర్ణయించడానికి సవాల్ చేస్తూ దాఖలైన ఐదు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఎన్నికల్లో అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేయాలనే ప్రతిపాదనకు మేము మద్దతు ఇవ్వబోమని, ఎన్నికలలో ఒక సీటు నుండి ఒకే అభ్యర్థి పోటీ చేయాలనే ప్రతిపాదనకు మద్దతిస్తామని కేంద్ర ఎన్నికల్ సంఘం(ఈసీ) సుప్రీం కోర్టుకు తెలిపింది.
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద తక్షణ అరెస్టుల నుంచి రక్షణ కల్పిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం రివ్యూ పిటిషన్ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.