సుప్రీం కోర్టులో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ నంబర్లకు ఆధార్ ను తప్పనిసరిగా అనుసంధానిస్తూ ఒక కేసును విచారించనుంది.
మంగళవారం సుప్రీం కోర్టులో పద్మావతి సినిమాను నిషేధించాలంటూ వేసిన పిటీషన్ ను ముచ్చటగా మూడోసారి తిరస్కరించింది. ఆయా రాష్ట్రాల్లో నిషేధం అంటూ వ్యాఖానించిన సియంలకు మొట్టికాయ వేసింది.
ఎస్సీ, ఎస్టీలను ఫోన్ లో దూషించినా నేరమే అని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. కులం పేరుతో దూషిస్తే గరిష్టంగా 5 ఏళ్లు జైలు శిక్ష ఖయమని జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
ఇటీవల సుప్రీం కోర్టు దూరవిద్యపై తీర్పును వెలువరిస్తూ, యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ (యూజీసీ)కు పలు ఆదేశాలు జారీచేసింది. దీనిపై స్పందించిన యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ (యూజీసీ) భారతదేశంలో ఉన్న 123 యూనివర్సిటీ లకు ఆ హోదాను రద్దు చేసింది. హోదా కోల్పోయిన ఆ విద్యాసంస్థలు తమ విద్యాసంస్థల చివర యూనివర్సిటీ అని పేరు పెట్టుకోరాదు. అయితే, సాధారణ విద్యాసంస్థల మాదిరిగా యధావిధిగా పనిచేస్తాయి. ఇకపై విద్యాసంస్థలన్నీ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తాయి.
యూనివర్సిటీ హోదా కోల్పోయిన విద్యాసంస్థలు (తెలుగు రాష్ట్రాలకు చెందినవి)
దేశంలోని హిందూ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హిందువులను మైనార్టీలుగా పరిగణించాలని సుప్రీంకోర్టు కోర్టులో పిల్ దాఖలైంది. ఢిల్లీకి చెందిన బీజేపీ నేత , అడ్వకేట్ అశ్వీని కుమార్ ఉపాధ్యాయ ఈ పిల్ ను దాఖలు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 8 రాష్ట్రాల్లో హిందు మైనార్టీలుగా ఉన్నారని..ఆయా రాష్ట్రాల్లో వారిని మైనార్టీలు గా గుర్తించి వారికి మైనారిటీలకు లభించే సౌకర్యాలు కల్పించాలని కోరారు.
కంచె ఐలయ్య రాసిన పుస్తకం 'సామాజిక స్మగ్లర్లు - కోమటోళ్లు' పుస్తకాన్ని నిషేధించలేమని సుప్రీం ధర్మాసనం తెలిపింది. పుస్తకాన్ని నిషేధించడం అంటే భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నట్లే అని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. ఐలయ్య రాసిన పుస్తకంపై నిషేధం విధించాలని సుప్రీం కోర్టు న్యాయవాది కె ఎల్ ఎన్ వి వీరాంజనేయులు పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం "ఒక వ్యక్తి తన భావాలను వ్యక్తపరచడం ప్రాథమిక హక్కు అని, రచయితకూ తన భావాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది" అని పేర్కొని కేసు కొట్టేసింది.
హర్షం వ్యక్తం చేసిన ఐలయ్య..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.