'పద్మావతి' కి సుప్రీంలో ఊరట

 మంగళవారం సుప్రీం కోర్టులో పద్మావతి సినిమాను నిషేధించాలంటూ వేసిన పిటీషన్ ను ముచ్చటగా మూడోసారి తిరస్కరించింది. ఆయా రాష్ట్రాల్లో నిషేధం అంటూ వ్యాఖానించిన సియంలకు మొట్టికాయ వేసింది. 

Last Updated : Nov 28, 2017, 01:51 PM IST
'పద్మావతి' కి సుప్రీంలో ఊరట

దేశవ్యాప్తంగా పద్మావతి సినిమాపై ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే..! అయితే.. మంగళవారం సుప్రీం కోర్టు పద్మావతి సినిమాను నిషేధించాలంటూ వేసిన పిటీషన్ ను ముచ్చటగా మూడోసారి తిరస్కరించింది. ఆయా రాష్ట్రాల్లో నిషేధం అంటూ వ్యాఖానించిన సియంలకు మొట్టికాయ వేసింది.

బాధ్యత గల పదవుల్లో ఉంటూ ఇలాంటి సున్నిత వ్యాఖ్యలు చేయడం ఏంటనీ.. హెచ్చరించింది. సినిమా ప్రదర్శించాలా ? లేదా వద్దా? అనేది సెన్సార్ బోర్డు నిర్ణయిస్తుంది. సెన్సార్ బోర్డే ఇంకా సినిమాపై స్పష్టత ఇవ్వలేదు. అలాంటప్పుడు మీరు  ఈ వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అని హెచ్చరించింది.

200 కోట్లతో తెరకెక్కించిన 'పద్మావతి' సినిమా షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ఈ చిత్రం ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిషేదించారు. సినిమా నిషేదించాలని సుప్రీంకోర్టులో ఇదివరకే రెండుసార్లు పిటీషన్ వేసినా.. కోర్టు ఆ కేసును తిరస్కరించింది. భన్సాలీ రాజకుటుంబీకులు, కర్ణి సేన సంఘాలతో కలిసి కూర్చొని మాట్లాడితే పరిష్కారం దక్కుతుందని పలువురు సూచిస్తున్నారు. భారత్ లో సినిమా విడుదల కానప్పటికీ.. బ్రిటన్ లో డిసెంబర్ 1 న విడుదల కానుంది 'పద్మావతి'. 

 

Trending News