ఎంపీ, ఎమ్మెల్యే క్రిమినల్ కేసులు నిర్ణయించేందుకు 12 ప్రత్యేక కోర్టులు

ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులను నిర్ణయించేందుకు 12 ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. 

Last Updated : Dec 13, 2017, 12:04 PM IST
ఎంపీ, ఎమ్మెల్యే క్రిమినల్ కేసులు నిర్ణయించేందుకు 12 ప్రత్యేక కోర్టులు

న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులను నిర్ణయించేందుకు 12 ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. 

ఈ ప్రత్యేక న్యాయస్థానాలు ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ లో ఉన్న 1,571 క్రిమినల్ కేసులను నిర్ణయిస్తాయి. సుప్రీంకోర్టు అన్ని కేసులను ఒక సంవత్సరంలోపు ముగించాలని ఆదేశించింది. ఈ కేసులను రాజకీయ నాయకులు తమ 2014 ఎన్నికల అఫిడవిట్ లో  వెల్లడించారు. దోషులుగా ఉన్న రాజకీయవేత్త ఎన్నికలలో పోటీ చేయటానికి లేదా ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేయడానికి అనుమతి లేదు.

Trending News