Chiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదు

Chiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్‌ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 10, 2024, 04:08 PM IST
Chiranjeevi: పవన్‌కల్యాణ్‌ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదు

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ పోటీ విషయమై మరోసారి సినీనటుడు చిరంజీవి స్పందించారు. అయితే తమ్ముడికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయడం లేదని స్పష్టం చేశారు. కానీ తన తమ్ముడు గెలవాలని ఆకాంక్షించారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నట్లు ప్రకటంచారు. ఈ నేపథ్యంలోనే తాను ఎక్కడా ప్రచారం చేయడం లేదని స్పష్టతనిచ్చారు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌ సంచలనం.. పిఠాపురంలో మావయ్య పవన్‌ కల్యాణ్‌కు మద్దతు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ఢిల్లీలో అందుకున్న అనంతరం చిరంజీవి శుక్రవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రత్యేక విమానంలో భార్య సురేఖ, కొడుకుకోడలు చరణ్‌, ఉపాసన తదితరులతో కలిసి తిరిగి వచ్చారు. విమానం దిగిన అనంతరం కనిపించిన మీడియాతో చిరంజీవి మాట్లాడారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నారని మీడియా ప్రశ్నించగా.. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో లేనని.. రాజకీయాలకు అతీతంగా ఉన్నట్లు వివరణ ఇచ్చారు. పద్మభూషణ్‌ అవార్డు అందుకోవడం తనకు సంతోషంగా ఉందని.. ఇదంతా ప్రజల ప్రేమాభిమానంతోనే సాధ్యమైందని ప్రకటించారు.

Also Read: Chiranjeevi: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపు

 

స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు విషయమై మీడియా ప్రశ్నించగా.. కచ్చితంగా ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలని చెప్పారు. ఎంజీఆర్‌కు భారతరత్న వచ్చినప్పుడు ఎన్టీఆర్‌కు కూడా రావడం సముచితం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక తన సోదరుడు పవన్‌ కల్యాణ్‌ ఎన్నిక విషయమై ప్రస్తావించగా.. 'పిఠాపురంలో ప్రచారానికి వెళ్లడం లేదు. ప్రచారానిక వెళ్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు' అని ప్రకటించారు. కానీ తమ కుటుంబం మొత్తం పవన్‌ వెంట ఉంటామని తెలిపారు. 

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారం 11వ తేదీతో ముగియనుంది. ఆఖరిరోజు ప్రచార కార్యక్రమానికి చిరంజీవి హాజరవుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీడియో సందేశం ద్వారా చిరు పవన్‌కు మద్దతు ప్రకటించారు. గ్లాస్‌ గుర్తుకు ఓటేసి తన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ను గెలిపించాలని కోరిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారా నాని, రాజ్‌ తరుణ్‌, అల్లు అర్జున్‌ మద్దతు ప్రకటించగా.. మెగా కుటుంబం నుంచి వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ నేరుగా పిఠాపురంలో కొన్ని రోజులు ప్రచారం చేశారు. పోలింగ్‌ సమయానికి చాలా మంది సినీ ప్రముఖులు పవన్‌కు మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News