నిర్భయ కేసులో నిందితుని పిటీషన్‌పై హియరింగ్

   

Last Updated : Nov 13, 2017, 10:54 AM IST
నిర్భయ కేసులో నిందితుని పిటీషన్‌పై హియరింగ్

2012లో నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో శిక్ష విధించబడ్డ నిందితుల్లో ఒకరైన ముఖేష్ గతంలో సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ట్రయల్ సమయంలో మరియు అప్పీలు చేసుకొనే సందర్భంలో ముఖేష్ వాదనలను క్రింది కోర్టు సరిగ్గా వినలేదని ఆయన తరఫున న్యాయవాది ఎంఎల్ శర్మ తమ పిటీషన్‌లో పేర్కొన్నారు. వాటిని విని పునర్ సమీక్షించి శిక్షను ఖరారు చేయాల్సిందిగా తెలిపారు. ఈ పిటీషన్ పై హియరింగ్ ను దీపక్ మిశ్రా, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం 13 నవంబరు 2017 తేదీన విననుంది. 16 డిసెంబరు, 2012 తేదీన ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయను ఆరుగురు వ్యక్తులు దారుణంగా రేప్ చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. అదే నెల 29వ తేదీన ఆమె సింగపూర్ ఆసుపత్రిలో మరణించారు. ఇదే కేసులో నిందితుడైన మరో వ్యక్తి రాంసింగ్ తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ కేసులో 2013 సెప్టెంబరు 13 తేదీన వెలువడింది. నిర్భయపై అత్యంత హేయంగా అత్యాచారం చేసి, కిరాతకంగా హింసించి చంపిన నరరూప రాక్షసులను చనిపోయేవరకూ ఉరితీయటమే సరైన శిక్ష అని న్యాయస్థానం తీర్పుచెప్పింది. శిక్ష విధించిన తర్వాత ముఖేష్ మరల సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. 

Trending News