బీహార్‌ కూడా రంజీలో ఆడాలి: సుప్రీంకోర్టు

దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు బిహార్‌కు కూడా రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం కల్పించాలని ఎట్టకేలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

Last Updated : Jan 4, 2018, 05:12 PM IST
బీహార్‌ కూడా రంజీలో ఆడాలి: సుప్రీంకోర్టు

దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు బిహార్‌కు కూడా రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం కల్పించాలని ఎట్టకేలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీహార్ రంజీ ట్రోఫీలో 2003 సీజన్ మాత్రమే ఆఖరిసారి ఆడింది. అయితే బిహార్ నుండి జార్ఖండ్ విడిపోయాక, రంజీ ట్రోఫీలో కేవలం కొత్త రాష్ట్రానికి మాత్రమే ఆడే అవకాశాన్ని కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ క్రమంలో బిహార్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిత్య వర్మ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. రంజీలో బిహార్‌కు ఆ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు ఉందని కోరుతూ ఆయన రెండు సంవత్సరాలుగా పోరాడుతున్నారు. 

2013లో ఐపీల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు బీసీసీఐ ప్రెసిడెంట్లు ఎన్.శ్రీనివాసన్‌తో పాటు అనురాగ్ ఠాకూర్‌ని కూడా హూస్టింగ్ చేయడంతో, లోథా
కమీషన్ ఏర్పడింది. బీసీసీఐ ఎలాంటి గైడ్‌లైన్స్ అనుసరించాలో, ఈ బోర్డు నియమ నిబంధనల్లో ఎలాంటి మార్పులు జరగాలో ఈ కమీషన్ సూచించింది. ఆ కమీషన్ నివేదిక నిమిత్తం బీసీసీఐ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటున్నపుడు ఆదిత్య వర్మ పిటీషన్ గురించి కూడా తెలిసింది. ఈ క్రమంలో ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఆదిత్య వర్మ పిటీషన్ పై తీర్పు ఇస్తూ...యూనిట్ల మధ్య గొడవలుంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని.. ఆ నెపంతో బీహార్ క్రీడాకారులను తమ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించవద్దని చెప్పడం తగదని తెలిపింది.

Trending News