Christmas Santa Claus: ఇటీవల నాసా విడుదల చేసిన నక్షత్రాల గుంపుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలలో నక్షత్రాల గుంపు అచ్చం చూడడానికి క్రిస్మస్ చెట్టులా ఉండడంతో సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ కి ముందు నాసా విడుదల చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Christmas Santa Claus: క్రిస్మస్ పేరు చెప్పగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది శాంతా క్లాజ్ తాత. తెలుగు గడ్డం, ఎర్రటి దుస్తులతో అలరిస్తున్నట్టుండే ఆ తాతను చూడగానే పిల్లల్లో హుషారొచ్చేస్తుంది. అసలు క్రిస్మస్ కు శాంటాక్లాజ్ కు ఉన్న సంబంధమేంటి, ఎవరీ శాంటాక్లాజ్ అనే వివరాలు తెలుసుకుందాం..
Minister RK Roja As Santa Claus: సాయం చేయాలంటూ ఓ బాధితుడు షేర్ చేసిన వీడియోకు మంత్రి రోజా చలించిపోయారు. శాంటా క్లాస్ వేషంలో వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు. విజయవాడ వాంబే కాలనీలోకి శాంటా క్లాస్ వేషంలో వెళ్లిన మంత్రి రోజాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
Attack on Santa Claus In Gujarat : అవదూత్ సొసైటీలో నివాసం ఉంటున్న ఒక క్రిస్టియన్ కుటుంబం ఇంటికి వెళ్లి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఆ సమయంలో అతడితో కొంతమంది మత పెద్దలు కూడా వెంట ఉన్నారు. ఆ కుటుంబంతో కలిసి వారు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలోనే కొంతమంది యువకులు వచ్చి వారిపై దాడికి పాల్పడ్డారు.
ఈ సారి క్రిస్మస్ (Christmas 2020) ప్రపంచ వ్యాప్తంగా చాలా కొత్తగా సెలబ్రేట్ చేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న శాంటాక్లాజ్ కూడా తన గిఫ్ట్ థీమ్స్‌ను మర్చాడు.(Photograph: Reuters)
శాంతాక్లాజ్.. క్రిస్మస్ తాత.. ఇలా ఏ పేరుతో పిలిచినా అతను ఆనందంగా పలుకుతాడు. చిన్నారులతో పాటు పెద్దల కోసం కూడా ఎన్నో బహుమతులు పట్టుకొస్తాడు. క్రిస్మస్ సమయంలో శాంతాక్లాజ్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటి క్రిస్మస్ తాత నుండి మనం కూడా కొన్ని మంచి మంచి విషయాలు నేర్చేసుకుందామా..
పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్న ఆధారాల ప్రకారం టర్కీలోని ఒక పాతబడిన చర్చి సముదాయంలో క్రిస్మస్ తాతగా మరియు శాంతా క్లాజ్‌గా పిలవబడే సెయింట్ నికోలస్ సమాధి లభ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. టర్కీలోని దక్షిణ అంటల్యా ప్రాంతంలోని డెమ్రె జిల్లాలో ఈ చర్చి ఉంది. ఇదే ప్రాంతాన్ని శాంతాక్లాజ్ జన్మ స్థలంగా చరిత్రకారులు చెబుతున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. దాదాపు 1674 సంవత్సరాల సమాధిని నిజంగానే బయటపెట్టడం సాధ్యమా.. అన్న అనుమానాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.