Attack on Santa Claus: క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా శాంటా క్లాజ్ వేషంలో పిల్లలకు చాక్లెట్స్ పంచిపెడుతూ పండగ శుభాకాంక్షలు చెబుతున్న ఒక వ్యక్తిపై ఆ ప్రాంతం వారు దాడికి పాల్పడిన ఘటన గుజరాత్‌లోని వదోదరలో చోటుచేసుకుంది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా తమకు నచ్చిన వారి వద్దకు శాంటా క్లాజ్ వేషంలో వెళ్లి వారిని సర్‌ప్రైజ్ చేసి గిఫ్ట్స్ ఇవ్వడం క్రైస్తవంలో ఒక ఆనవాయితీ అనే సంగతి తెలిసిందే. అందులో భాగంగానే డిసెంబర్ 20న వదోదరలోని మకర్పుర ప్రాంతంలో ఒక వ్యక్తి శాంటాక్లాజ్ వేషంలో తిరుగుతూ చాక్లెట్స్ పంచిపెడుతూ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు చెబుతూ వెళ్తున్నాడు.
ఈ క్రమంలోనే అవదూత్ సొసైటీలో నివాసం ఉంటున్న ఒక క్రిస్టియన్ కుటుంబం ఇంటికి వెళ్లి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఆ సమయంలో అతడితో కొంతమంది మత పెద్దలు కూడా వెంట ఉన్నారు. ఆ కుటుంబంతో కలిసి వారు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలోనే కొంతమంది యువకులు వచ్చి వారిపై దాడికి పాల్పడ్డారు. మకర్పుర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంటా క్లాజ్ వేషంలో ఉన్న వ్యక్తిపై దాడికి పాల్పడి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. ఆ వ్యక్తి ధరించిన శాంటా క్లాజ్ దుస్తులు విప్పించి అక్కడి నుంచి వెళ్లగొట్టారు.
ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది హిందువుల ప్రాంతమని.. ఇక్కడ ఇలాంటి మతపరమైన కార్యక్రమాలకు అనుమతించమని బెదిరిస్తూ నిందితులు తమపై దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి గురైన వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని మకర్పుర పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి : Woman To Kill Husband: లవర్ను మేనమామగా పరిచయం చేసి భర్తను లేపేయడానికి భార్య సూపర్ స్కెచ్..కానీ!
ఇది కూడా చదవండి : Charles Sobhraj: ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
ఇది కూడా చదవండి : House Owner Gangrape Case: ఇంట్లో అద్దెకు దిగి.. నలుగురిచేత గ్యాంగ్ రేప్ చేయించిన మహిళ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook