Minister RK Roja: బాధితుడి వీడియోకు చలించిన మంత్రి రోజా.. శాంటా క్లాజ్ వేషంలో వెళ్లి సర్‌ప్రైజ్

Minister RK Roja As Santa Claus: సాయం చేయాలంటూ ఓ బాధితుడు షేర్ చేసిన వీడియోకు మంత్రి రోజా చలించిపోయారు. శాంటా క్లాస్ వేషంలో వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు. విజయవాడ వాంబే కాలనీలోకి శాంటా క్లాస్‌ వేషంలో వెళ్లిన మంత్రి రోజాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2023, 02:58 PM IST
Minister RK Roja: బాధితుడి వీడియోకు చలించిన మంత్రి రోజా.. శాంటా క్లాజ్ వేషంలో వెళ్లి సర్‌ప్రైజ్

Minister RK Roja As Santa Claus:

మంత్రి ఆర్కే రోజా మారువేశంలో విజయవాడ వాంబే కాలనీలో ప్రత్యక్షమయ్యారు. శాంటా క్లాజ్ వేషంలో ఓ పేదవాడి ఇంటికి వెళ్ళి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. విజయవాడ వాంబే కాలనీలో నివాసముండే నాగరాజు రోడ్డు మీద చెప్పులు అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. నాగరాజుకి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 

నాగరాజు భార్యకి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు కిడ్నీ తొలగించారు. దీంతో దాచుకున్న సొమ్ము మొత్తం ఖర్చు అయిపోయింది. ఇక నాగరాజుకి కూడా ఆరోగ్య సమస్యలు మొదలైంది. దీంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడు. ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్‌తో ఇల్లు గడుపుకుంటూ ఇక చివరి ప్రయత్నం మంత్రి రోజాను కలిసి తనకి తోచిన సాయం  చేయాలని వేడుకుంటూ చేసిన ఓ వీడియో చేశాడు. ఈ వీడియోను ఓ విలేఖరి మంత్రి రోజాకి తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోకి చలించిన రోజా.. నాగరాజు కుటుంబ వివరాలు తీసుకున్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి పుట్టినరోజుకు ఏదో ప్రత్యేక కార్యక్రమం చేయడం మంత్రి రోజాకు అలవాటు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజుకి అనాథ విద్యార్థిని దత్తత తీసుకొని ఆమెను MBBS చదివిస్తున్నారు. మరో పుట్టిన రోజుకి ఏకంగా తన నియోజకవర్గంలోని మీరాసాబ్ పాల్యం అనే గ్రామాన్నే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. ఈసారి నాగరాజు కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకువచ్చారు. నేడు వైఎస్ జగన్ పుట్టినరోజున నాగరాజు ఇంటికి క్రిస్మస్ తాతగా మారి.. నాగరాజు పిల్లలకి చాక్లెట్లు, బిస్కేట్స్ కేక్ తీసుకెళ్లారు. నాగరాజు తలుపు తట్టి సర్ప్రైజ్ చేశారు. 

మంత్రి రోజా రాకతో ఆ అభాగ్యుడి ఇంట్లో పండుగ వాతావరణం వచ్చింది. సీఎం జగన్ పుట్టిన రోజులు ఆ కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. వారి యోగక్షేమాలు అడిగి తన వంతుగా వారి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. సొంతంగా వ్యాపారం ఏదైనా  ప్రారంభించి ఎదగాలని నాగరాజుకు సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి అవసరం ఉన్నా.. తనని సంప్రదించవచ్చని ధైర్యం చెప్పి వచ్చారు.

ఈ విషయం గురించి మంత్రి ఆర్కే రోజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నాగరాజు నిజ జీవిత కథ నన్ను ఎంతగానో కదిలించింది.‌ మా నాన్న పేరు నాగరాజు.  ఇక్కడ ఈ నాగరాజు తన  పిల్లను కాపాడుకోవాలని‌ పడుతున్న తపన నా కంట తడి పుట్టించింది. నాన్న ఆవేదన నాకు బాగా తెలుసు . అందుకే మా అన్న పుట్టిన రోజుకి ఆ కుటుంబానికి అక్కగా మారాలనుకున్నాను . ఎల్లప్పుడు వారి అందుబాటులో ఉంటానని మాటిచ్చాను. నా ఈ సంకల్పం ఇలాంటి కుటుంబాల దీవెనలే నాకు నా జగనన్నకి శ్రీరామ రక్ష, మనకి నచ్చినవారి పుట్టినరోజుకి విలువైన బహుమతి కన్నా.. విలువలతో కూడిన బహుమతి మిన్నా.." అని అన్నారు.

Also Read: Bhatti Vikramarka: అసెంబ్లీలో కరెంట్‌పై లొల్లి.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. లెక్కలు బయటపెట్టిన భట్టి..!   

Also Read: Free Bus Ticket: ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం.. వాళ్లు టిక్కెట్‌ కొనాల్సిందే.. కొత్త రూల్స్ ఇవే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News