RS Praveen Kumar: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కి ఆతిథ్యం ఇవ్వడమే ఆ తహశీల్ధార్ బదిలీకి కారణమా ?

RS Praveen Kumar's name linked to Narketpalli Tahasildar transfers: ఇటీవలే రిటైర్మెంట్ తీసుకుని బిఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ రాష్ట్రవ్యాప్తంగా మెరుపు పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళిత బంధు పథకంపైనా (Dalita Bandhu scheme) ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2021, 09:54 AM IST
RS Praveen Kumar: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కి ఆతిథ్యం ఇవ్వడమే ఆ తహశీల్ధార్ బదిలీకి కారణమా ?

RS Praveen Kumar's name linked to Narketpalli Tahasildar transfers: నార్కెట్‌పల్లి: ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కి ఆతిథ్యం ఇవ్వడమే తహశీల్ధార్ బదిలీకి కారణమా ? అనే టైటిల్ చూడగానే.. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కి ఆతిథ్యం ఇవ్వడానికి, ఒక తహశీల్ధార్ బదిలీకి లింకు ఏంటి అనే సందేహం రావొచ్చేమో!! ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం తహసీల్దార్‌ బదిలీ వెనుక రాజకీయ హైడ్రామా నడిచినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఒక తహశీల్ధార్ బదిలీ అనేది సర్వసాధారణమైన విషయమే అయినప్పటికీ.. ఆ బదిలీ వెనుకున్న కారణంపై జరుగుతున్న ప్రచారమే ప్రస్తుతం చర్చనియాంశమైంది. నార్కెట్‌పల్లి తహశీల్ధార్ పొడపంగి రాధను పెద్ద అడిశర్లపల్లికి, అక్కడి తహసీల్దార్‌ దేవదాస్‌ను నార్కట్‌పల్లికి బదిలీచేస్తూ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఈ నెల 11వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో చర్చనియాంశమయ్యేంత పెద్ద విషయం ఏముంది అనే సందేహం రావొచ్చేమో. అయితే, స్థానికంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ బదిలీ పరిణామం వెనుక ఓ ఘటన ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇటీవలే రిటైర్మెంట్ తీసుకుని బిఎస్పీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ రాష్ట్రవ్యాప్తంగా మెరుపు పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళిత బంధు పథకంపైనా (Dalita Bandhu scheme) ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 4వ తేదీన నార్కట్‌పల్లి నుంచి వెళ్తు అక్కడ ఆగిన ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌కు అక్కడి స్థానిక తహశీల్ధార్ పొడపంగి రాధ ఆతిథ్యం ఇచ్చారని.. ఈ కారణంగానే తహసీల్దార్‌ రాధను పెద్ద అడిశర్లపల్లికి, అక్కడి తహసీల్దార్‌ దేవదాస్‌ను నార్కట్‌పల్లికి బదిలీచేశారనేది స్థానికంగా జరుగుతున్న ప్రచారం. 

Also read: Minister Harish Rao slams Etela Rajender: ఈటల రాజేందర్‌ భాషపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం

ఇదిలావుంటే, ఈ బదిలీ వ్యవహారం చర్చనియాంశం కావడం వెనుక మరో కారణం ఉంది. అదేమంటే.. బదిలీ అనంతరం తక్షణమే తమ కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో ఆదేశించడంతో శుక్రవారం ఉదయం దేవదాసు నార్కట్‌పల్లి తహసీల్దార్‌గా (Narketpalli Tahasildar) బాధ్యతలు చేపట్టగా.. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే ఆయనను కలెక్టరేట్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి. 

ఇదిలావుంగా నార్కెట్‌పల్లి తహశీల్దార్ దేవదాసు స్థానంలో సీఎం కేసీఆర్ (CM KCR) అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోని జగదేవ్‌పూర్‌ తహసీల్దార్‌ పల్నాటి శ్రీనివాస్‌ రెడ్డిని నార్కట్‌పల్లి తహసీల్దార్‌గా నియమిస్తూ ఆదేశాలు రావడంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన కూడా వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇలా ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరు తహశీల్దార్లు బాధ్యతలు చేపట్టగా అందులో ఒకరు కలెక్టరేట్‌లో రిపోర్ట్ చేయాల్సి రావడమే చర్చకు దారితీసింది. నార్కెట్‌పల్లిలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కి (Retired IPS RS Praveen Kumar) ఆతిథ్యం ఇచ్చిన కారణంగానే ఇదంతా జరిగినట్టు స్థానికులు చెప్పుకుంటున్నారు. 

Also read : Huzurabad Bypoll: టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ ను ప్రకటించిన గులాబీ బాస్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News