Revanth Reddy Fires on PM Modi And CM KCR: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని.. వచ్చే ఎన్నికల్లో పొత్తు కుదిరిందన్నారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అంటూ ఎద్దేవా చేశారు.
Congress Six Guarantee Schemes: అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను వంద రోజుల్లోనే నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో బీఆర్ఎస్ నేతలు కకావికలం అవుతున్నారని అన్నారు.
Revanth Reddy On One Nation One Election: జమిలి ఎన్నికల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధ్యక్ష తరహా ఎన్నికలు తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy Vs Minister KTR: నాగర్ కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపించాలని కోరారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నాగర్ కర్నూల్ పీఎస్‌లో కేసు నమోదైంది. పోలీసులను కించపరిచేలా మాట్లాడరన్న వ్యాఖ్యలపై కేసు నమోదైంది. పార్టీలో చేరికల సందర్భంగా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy On Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ వాళ్లపై కేసులు పెట్టించారని.. తాము మహబూబ్ నగర్‌కు వస్తే వీపు చింతపండు అవుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అభివృద్ధి ముసుగులో పేదల భూములను బీఆర్ఎస్ గుంజుకుంటోందని మండిపడ్డారు.
Revanth Reddy Visits Uppal and LB Nagar: ప్రగతి భవన్ చిల్లర రాజకీయాలకు వేదికగా మారిందంటూ ఘాటు విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. వరదలపై ముందస్తుగా సీఎం సమీక్షలు చేయలేదని.. మంత్రి కేటీఆర్‌కు ప్రజల ప్రాణాలపై శ్రద్ధలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy Letter to Minister KTR: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికే సరిపోయిందంటూ ఫైర్ అయ్యారు. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయిందన్నారు.
Revanth Reddy On Harish Rao: మంత్రి హరీష్ రావుపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వార్డు మెంబర్ కూడా కాలేని ఆయనను వైఎస్ఆర్ అప్పట్లో మంత్రిని చేశారని అన్నారు. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అని చెప్పడానికి హరీష్‌కు సిగ్గుండాలంటూ ఫైర్ అయ్యారు.
Revanth Reddy On Dharani Portal: ధరణి పోర్టల్‌లో భారీగా అక్రమాలు జరిగాయని.. జూలై 15వ తేదీ తరువాత అన్ని బయటపెడతామని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామన్నారు. ఈ సందర్భంగా భూమి డిక్లరేషన్‌ను విడుదల చేశారు.
Revanth Reddy Counter to Ministers: రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన మంత్రులు, బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీకే తెలంగాణలో పర్యటించే అర్హత ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. రూ.4 వేల పెన్షన్ ఇచ్చి తీరుతామని స్పష్టంచేశారు.
EX MP Ponguleti Srinivas Reddy News: అభిమానులు, కార్యకర్తల నిర్ణయం మేరకే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి. ఖమ్మంలో 10కి 10 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Revanth Reddy Fires on KTR: తెలంగాణ అమరుల స్థూపం నిర్మాణంలో భారీ అక్రమాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.80 కోట్లకు మొదలైన అగ్రిమెంట్.. 179 కోట్ల 5 లక్షలకు పెంచేశారని అన్నారు. కేటీఆర్‌ను బాటా చెప్పులతో కొట్టినా ఆయన పాపాలు తొలగిపోవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy on Arvind Kumar: మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ, మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ పంపించిన లీగల్ నోటీసులకు సమాధానం పంపించారు రేవంత్ రెడ్డి. తనకు పంపించి లీగల్ నోటీలసుకు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవింద్ కుమార్ రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Revanth Reddy On CM KCR: ఈ నెల 8న సరూర్ నగర్లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభలో ప్రియాంక గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
Hyderabad Police Stopped Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కొత్త సచివాలయంలో హెచ్ఎండీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీని కలిసేందుకు ఆయన వెళ్లగా.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.