Revanth Reddy: తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే.. కేసీఆర్ ఖేల్ ఖతం-బీఆర్ఎస్ దుఖాన్ బంద్: రేవంత్ రెడ్డి

Revanth Reddy Vs Minister KTR: నాగర్ కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్ పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపించాలని కోరారు.

Written by - Ashok Krindinti | Last Updated : Aug 28, 2023, 04:48 PM IST
Revanth Reddy: తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే.. కేసీఆర్ ఖేల్ ఖతం-బీఆర్ఎస్ దుఖాన్ బంద్: రేవంత్ రెడ్డి

Revanth Reddy Vs Minister KTR: చేవెళ్ల దళిత-గిరిజన డిక్లరేషన్ అమలు చేసి దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దళితులు, గిరిజనుల జీవితాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా దళిత-గిరిజన డిక్లరేషన్ ప్రకటించామని తెలిపారు. సోమవారం నాగర్ కర్నూలు, అచ్చంపేట నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ప్రజలు జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టి.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామని అన్నారు. పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు గెలిపిస్తే.. రాష్ట్రంలో 100 సీట్లు గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. గ్రామ గ్రామాన తిరగాలని.. ప్రతీ తలుపు తట్టి బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తిరగబడదాం.. తరిమికొడదాం నినాదంతో ముందుకు వెళదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు జిల్లాలోని అన్ని సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులకు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు, పైలేరియా డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మరోసారి హామీనిచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతోపాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల సాయం అందిస్తామన్నారు. 

అంతకుముందు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటేనని.. 'కేసీఆర్ ఖేల్ ఖతం-బీఆర్ఎస్ దుఖాన్ బంద్' అని అన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన డిక్లరేషన్‌పై కేటీఆర్ చేసిన నేపథ్యంలోనే మంత్రిని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేశారు.

 

 

Also Read: Central Govt Schemes: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. ఈ స్కీమ్ కింద అతి తక్కువ వడ్డీకే లోన్లు..!  

Also Read: Minister Roja: రజనీకాంత్ స్టైల్లో మంత్రి రోజా డైలాగ్.. పవన్, చంద్రబాబుకు కౌంటర్.. అర్థమైందా రాజా..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook  

Trending News