Private firms can buy coaches : రైల్వేశాఖ త్వరలో రైల్వే బోగీలను అద్దెకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఆసక్తి ఉన్నవాళ్లు.. రైల్వే బోగీలను లీజుకు తీసుకొని.. వాటిని తమ ఆసక్తికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవచ్చు.
కరోనావైరస్ కారణంగా మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సడలింపుల మేరకు మే నెలలో 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.
రైలు ప్రయాణాన్ని (Train Journey ) వేగవంతం, మరింత సౌకర్యవంతం చేయడడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ( Railway Ministry ) చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం వందే భారత్ ఎక్స్ ప్రెస్. ప్రాజెక్టు 2023 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది.
వలసకూలీలకు ( Migrant workers ) ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలను శ్రామిక్ స్పెషల్ ట్రెయిన్స్ ( shramik special trains ) ద్వారా వారి స్వస్థలాలకు చేరవేయడంలో నిరంతరంగా సేవలు అందిస్తున్న ఇండియన్ రైల్వే ( Indian Railways ).. తాజాగా మరో ప్రకటన చేసింది.
రైలులో బంధువులను లేదా కుటుంబ సభ్యులను ఎక్కించడానికి వెళ్తున్నప్పుడు.. ప్రయాణం చేయని వారు ప్లాట్ ఫారమ్ టికెట్ కొనడం తప్పనిసరి. గతంలో మూడు, నాలుగు, ఐదు రూపాయలు ఉన్న ప్లాట్ ఫారమ్ టికెట్ ఇప్పుడు 10 రూపాయలకు చేరుకుంది.
రైల్వే సేవల్లో అధికార యంత్రాగం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యంగా నాణ్యమైన ఆహారం, మౌళిక సదుపాయలను అందించడంలో ఇండియన్ రైల్వేస్ విఫలం అవుతోందని తరచుగా విమర్శలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో తమ ప్రయాణీకులకు అందించే సేవలపై నిఘా నేత్రం ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతోంది. అందులో భాగంగానే సివిల్ డ్రెస్లో మఫ్టీలో ఉండే అధికారుల నియామకానికి రైల్వే శాఖ రంగం సిద్ధం చేసుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.