Indian Railways: రైల్వేలో లక్షా 27 వేల మంది నియామకాల ప్రక్రియ ఎక్కడిదాకా వచ్చింది?

రెండు సంవత్సరాల క్రితం భారతీయ రైల్వే అతి పెద్ద రిక్రూట్ మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇందులో అప్డేట్స్ ఇవే  

Last Updated : Aug 18, 2020, 10:52 PM IST
    1. రెండు సంవత్సరాల క్రితం భారతీయ రైల్వే అతి పెద్ద రిక్రూట్ మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. ఇందులో అప్డేట్స్ ఇవే
    2. రైల్వేను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా కొనసాగించడానికి రెండు సంవత్సరాల క్రితం ఈ భర్తీ ప్రక్రియను ప్రారంభించింది.
Indian Railways: రైల్వేలో లక్షా 27 వేల మంది నియామకాల ప్రక్రియ ఎక్కడిదాకా వచ్చింది?

ప్రపంచంలోనే అతి పెద్ద రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను భారతీయ రైల్వే ( Indian Railways ) విజయవంతంగా కొనసాగిస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ ( Railway Ministry) ప్రకారం అసిస్టెంట్ పైలెట్ ( Assistant Pilot) , సాంకేతిక సిబ్బందికి సంబంధించిన భర్తీ ఇప్పటికే పూర్తి అయ్యాయి. 64 వేల పోస్టుల కోసం మొత్తం 47 లక్ష 45 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా అందులో 56378  మందిని అసిస్టెంట్ పైలెట్, సాంకేతిక సిబ్బందిగా ఎంపిక చేసింది. 

వీరిలో 19,120 మందికి ట్రైనింగ్ లాక్ డౌన్ ( Lockdown) నియమాలు పూర్తిగా తొలగించాక నిర్వహిస్తారని సమాచారం. మిగితా వారిని కూడా దశల వారీగా ట్రైనింగ్ నిర్వహించనున్నారు. అదే సమయంలో సాంకేతికేతర ఉద్యోగాల కోసం భారీగా పరీక్షలు నిర్వహించడానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు రైల్వేకు మొత్తం 1,26,30,885 ఆన్ లైన్ దరఖాస్తులు అందాయి అని సమాచారం.

ఇంత భారీ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడానికి కరోనావైరస్ ( Coronavirus ) పరిస్థితులను గమనించిన రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. ఇందుకోసం అభ్యర్థులు రైల్వే శాఖ ఎంపిక చేసిన ఆన్ లైన్ సైట్లో పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. రైల్వేను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా కొనసాగించడానికి రెండు సంవత్సరాల క్రితం ఈ భర్తీ ప్రక్రియను ప్రారంభించింది.

 

Trending News