అదనపు సామాన్లకు జరిమానా లేదు: రైల్వే శాఖ

రైల్వే పరిమితి మించి సామాను తీసుకెళ్తే జరిమానా విధించాలన్న రైల్వే శాఖ ప్రకటనను ప్రయాణీకులు తీవ్రంగా వ్యతిరేకించారు.

Last Updated : Jun 8, 2018, 12:54 PM IST
అదనపు సామాన్లకు జరిమానా లేదు: రైల్వే శాఖ

రైల్వే పరిమితి మించి సామాను తీసుకెళ్తే జరిమానా విధించాలన్న రైల్వే శాఖ ప్రకటనను ప్రయాణీకులు తీవ్రంగా వ్యతిరేకించారు. అధిక లగేజీకి ప్రయాణికులకు జరిమానా విధించాలనే రైల్వే నిర్ణయంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎక్కువ సామాగ్రితో తోటి ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బందులు పడతారో తెలిపేందుకు ఈనెల 1 నుంచి 6 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, సామాన్లకు సంబంధించి నిబంధనలను ప్యాసిజర్లకు తెలిపామని రైల్వే శాఖ ప్రతినిధి రాజేష్ పేర్కొన్నారు.

కాగా 174 రైల్వేస్టేషన్లలో త్వరలో చెల్డ్‌ హెల్ప్‌డెస్క్ లను ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. పారిపోయిన, తప్పిపోయిన, విడిచిపెట్టిన, అక్రమ రవాణాకు గురవుతున్న పిల్లలను గుర్తించేందుకు ఈ హెల్ప్‌డె్‌స్కలను ప్రవేశపెడుతున్నామని రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వని లోహని తెలిపారు.

స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణికులు 40 కిలోల లగేజీని, సెకండ్‌ క్లాస్‌ ప్రయాణికులు 35 కిలోల లగేజీని ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా తమ వెంట తీసుకెళ్లేందుకు రైల్వే అనుమతిస్తోంది. కానీ అంతకన్నా ఎక్కువ లగేజీ తీసుకెళ్తే సాధారణ చార్జీల కన్నా ఆరు శాతం ఎక్కువ జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని.. త్వరలోనే ఈ పాత నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలుపగా..  ప్రయాణీకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ నిబంధనను ఉపసంహరించుకుంది.

 

Trending News