భారతరత్న, మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని స్మరించుకుంటూ తెలంగాణ శాసనసభ సమావేశాలలో భాగంగా నేడు సభలో ఆయనకు సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభలో సంతాప తీర్మానాన్ని ( Tribute to Pranab Mukherjee ) ప్రవేశపెట్టారు.
మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీకి 10 రాజాజీమార్గ్‌లోని తన అధికారిక నివాసంలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ముందుగా రక్షణ అధికారులు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంజలి ఘటించారు.
మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ పార్థీవ దేహాన్ని న్యూఢిల్లీ ఆర్మీ ఆసుపత్రి నుంచి 10 రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసానికి మంగళవారం ఉదయం అధికారులు తరలించారు. ఆయన పార్థీవ దేహానికి పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.
మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీ (84) సోమవారం ఢిల్లీలోని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే.. మంగళవారం ఉదయం 8గంటలకు ఆర్మీ ఆసుపత్రి నుంచి పార్థీవ దేహాన్ని రాజాజీమార్గ్‌లోని ప్రణబ్ అధికారిక నివాసానికి తరలించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.