ప్రణబ్‌కు నివాళులర్పించిన రక్షణ మంత్రి, అధికారులు

మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్‌ ముఖర్జీ పార్థీవ దేహాన్ని న్యూఢిల్లీ ఆర్మీ ఆసుపత్రి నుంచి 10 రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసానికి మంగళవారం ఉదయం అధికారులు తరలించారు. ఆయన పార్థీవ దేహానికి పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. 

Last Updated : Sep 1, 2020, 10:54 AM IST
ప్రణబ్‌కు నివాళులర్పించిన రక్షణ మంత్రి, అధికారులు

Rajnath Singh Pays Last Respects to Pranab Mukherjee: న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, రాజకీయ దురంధరుడు ప్రణబ్‌ ముఖర్జీ పార్థీవ దేహాన్ని న్యూఢిల్లీ ఆర్మీ ఆసుపత్రి నుంచి 10 రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసానికి మంగళవారం ఉదయం అధికారులు తరలించారు. ఆయన పార్థీవ దేహానికి పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ముందుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDs‌) బిపిన్ రావ‌త్‌, ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణే, ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఆర్‌కేఎస్ భ‌దౌరియా, నేవీ చీఫ్ అడ్మిర‌ల్ క‌రంబీర్ సింగ్ నివాళుల‌ర్పించారు. అనంత‌రం ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌ణ‌బ్ ముఖర్జీకి నివాళులర్పించారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. Also read: Pranab Mukherjee in criticism: కాంగ్రెస్‌కి కోపం తెప్పించిన ప్రణబ్ ముఖర్జీ

 

Trending News