జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్బంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించుటకై ప్రధానమంత్రి మోదీ ఈ రోజు 'స్వామిత్వ యోజన' పథకాన్ని ప్రకటించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించిన
భారత్‌లో కరోనా వైరస్‌ను నియంత్రించే దిశగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ బుధవారం ఓ లేఖ రాశారు.
కరోనా వైరస్ చికిత్స కోసం ఉపయోగిస్తోన్న హైడ్రోక్లోరోకిన్ ఔషదాన్ని తమకు ఎగుమతి చేయాల్సిందిగా 25 దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు భారత్ ఓకే చెప్పింది. దేశంలో ఉన్న నిల్వల గురించి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత ఎన్నో సమాలోచనలు చేసిన తర్వాతే భారత సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ కొనసాగిస్తారా లేదా అనేదే ప్రస్తుతం యావత్ భారతీయుల మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్న. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే లాక్ డౌన్ ఎత్తేసే పరిస్థితే కనిపించడం లేదు కానీ ఈ విషయంలో కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగామారింది.
కరోనా వైరస్ నివారణ గురించి ప్రధాని నరేంద్ర మోదీకి పలు సలహాలు, సూచనలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం ఓ లేఖ రాశారు.అప్పుడే దేశం కరోనావైరస్పై సమర్థవంతంగా పోరాడగలదని ఆమె స్పష్టంచేశారు.
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ను కంట్రోల్ చేయడం కోసం 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం పడిపోయింది.
ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి కొవ్వొత్తులు, దీపాలు, లేదా మొబైల్ ఫ్లాష్, టార్చ్ లైట్స్ వెలిగించి కరోనాపై యుద్ధానికి మద్దతు తెలపాల్సిందిగా మన దేశ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus) చెందకుండా ఉండేందుకు కేంద్రం విధించిన లాక్ డౌన్ (Lockdown) విధానంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనావైరస్ పరీక్షల్లో నిమగ్నమైన సిబ్బందికి, కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి సరైన కరోనా సోకకుండా సరైన సదుపాయాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆమె మండిపడ్డారు.
నిర్భయ కేసు (Nirbhaya case)లో దోషులుగా ఉన్న ముఖేష్ సింగ్, అక్షయ్ కుమార్, పవన్ గుప్త, వినయ్ శర్మ (Nirbhaya case convicts)లను ఉరితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా ఈ అంశంపై స్పందించారు.
కరోనావైరస్ దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో వైరస్ ఎటాక్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jagan) కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP) లేఖలు రాశారు. ఢిల్లీలో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీపీ మాట్లాడుతూ.. ఆ లేఖల్లోని సారాంశాన్ని వెల్లడించారు.
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహం జరగనున్న నేపథ్యంలో ఆ వివాహ వేడుకకు రావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం రమేశ్ ఆహ్వానించారు.
దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా పది తాజా ముఖ్యాంశాలను ఒక్క చోట చేర్చి అందించే ప్రయత్నమే ఈ టాప్ 10 జాతీయ వార్తలు. దేశంలో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
‘రాహుల్ గాంధీని ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నారు. రాహుల్‌తో నాకు వ్యక్తిగతంగా ఏ విభేదాలు లేవు. చాలా మంచి వ్యక్తి. కానీ నవ భారతానికి ఓ వంశానికి చెందిన ఐదవ తరం నేత అవసరం లేదు. 2024 ఎన్నికల్లో రాహుల్‌ను ఎన్నుకోవద్దు’ అని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సూచించారు.
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నుంచి మొదలుకుని పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు, ఏపీలో జరుగుతున్న అమరావతి రైతుల ఆందోళనలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువకులపై పోలీసుల దాడి ఘటన, తిరుపతిలో భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం వంటి వార్తాంశాలను ఈ 20-20 వార్తల్లో చూడొచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.