కరోనా వైరస్ వ్యాపించకుండా జనం ఇంటికే పరిమితమవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌లు ఓ వీడియో సాంగ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కోటి కంపోజ్ చేసిన ఈ సాంగ్‌కి తెలుగు ఆడియెన్స్ నుండి భారీ స్పందన కనిపించింది. ప్రపంచ దేశాలన్నీ ఏకమై చేస్తోన్న ఈ యుద్ధానికి మనం కూడా మద్దతు పలుకుదాం.. కరోనాపై విజయంలో మన వంతు పాత్ర పోషిద్దాం అనే చక్కటి సందేశాన్నిచ్చే ఈ పాట చూసి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఫిదా అయ్యారు. పాట రూపంలో కరోనాపై అందరికీ అవగాహన కల్పిస్తూ చైతన్యపరిచినందుకు చిరంజీవి గారికీ, నాగార్జున గారికీ, వరుణ్ తేజ్‌కి, సాయి ధరమ్ తేజ్‌కి ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం. #IndiaFightsCorona https://t.co/01dO5asinD
— Narendra Modi (@narendramodi) April 3, 2020
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం... అంటూ మరోసారి యావత్ భారతావనికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.