మరో వీడియో విడుదల చేసిన చిరు

ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి కొవ్వొత్తులు, దీపాలు, లేదా మొబైల్ ఫ్లాష్, టార్చ్ లైట్స్ వెలిగించి కరోనాపై యుద్ధానికి మద్దతు తెలపాల్సిందిగా మన దేశ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

Last Updated : Apr 4, 2020, 10:56 PM IST
మరో వీడియో విడుదల చేసిన చిరు

ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి కొవ్వొత్తులు, దీపాలు, లేదా మొబైల్ ఫ్లాష్, టార్చ్ లైట్స్ వెలిగించి కరోనాపై యుద్ధానికి మద్దతు తెలపాల్సిందిగా మన దేశ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు రేపు ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు ఎలక్ట్రిక్ లైట్స్ ఆర్పేసి దీపాలు వెలిగించి సంఘీభావం తెలుపుదామని చిరంజీవి తెలుగువారికి పిలుపునిచ్చారు. కరోనాను తుద ముట్టించేందుకు భారతీయులంతా కలిసి ఒక్కటయ్యారనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు ఇద్దామని చెప్పారు. ఈ మేరకు చిరంజీవి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. చిరంజీవి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.

Read also : కరోనా లక్షణాలతో ప్రభుత్వాస్పత్రికి వెళ్తే.. పారాసిటమోల్ ఇచ్చారు

ఇదిలావుంటే, అంతకంటే ముందుగా కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు అందరూ సోషల్ డిస్టన్స్ పాటిస్తూ ఇళ్లలోనే ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి, మెగాస్టార్ చిరంజీవి కలిసి రూపొందించిన వీడియో సాంగ్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇదే వీడియో సాంగ్‌ ద్వారా కింగ్ నాగ్, మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా తెలుగు వారికి కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ పాటను చూసిన ప్రధాని మోదీ.. ఆ నలుగురు హీరోలకు ట్విటర్ ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగులో ఓ ట్వీట్ చేశారు. హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News