తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎటుచూసినా నీరే కనిపిస్తుండంటంతో భాగ్యనగరవాసులు భయాందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే.. భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 15 కు చేరింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( heavy rains) నగరం మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిచేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య తాజాగా 11కు చేరింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైంది. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం జలమయమయింది. రహదారులు, కాలనీలన్నీ వరద నీటితో దర్శనమిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిచేరింది.
మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య (Bhiwandi building collapse Death toll) 41కి చేరుకుంది. మూడు రోజులపాటు కొనసాగించిన సహాయక చర్యలను నాలుగోరోజైన గురువారం నిలిపివేశారు.
మహారాష్ట్రలో జరిగిన భవనం కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య (Death Toll Rises in Bhiwandi Building Collapse) పెరిగిపోతోంది. ఇప్పటివరకూ భీవండి భవనం కుప్పకూలిన ఘటనలో 35 మంది మరణించారని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు.
మహారాష్ట్ర (Maharashtra) లోని థానే భీవండి పట్టణం (Bhiwandi ) లో సోమవారం తెల్లవారుజామున మూడంతస్థుల భవనం కుప్పకూలి ( building collapses ) ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.
Cyclone Nisarga నిసర్గ తుఫాను రేపు బుధవారం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అలజడి సృష్టిస్తున్న నిసర్గ తుఫాన్ ( Cyclone Nisarga in Arabia sea ).. ముంబైకి 430 కిమీ దూరంలో, మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది (Cyclone Nisarga may landafll ).
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ( Vizag gas leak ) తీవ్రంగా అనారోగ్యం బారిన పడిన బాధితులను చూసి తర్వాత ఇంకేం జరుగుతుందోననే ఆందోళన, భయం గ్రామస్తులను వెంటాడుతున్న నేపథ్యంలో బాధితులకు భరోసా కల్పించేందుకు మంత్రులు, అధికారులు ఇక్కడే ఉంటామని మంత్రి అవంతీ శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా కింద అందించనున్నట్టు సీఎం వైఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు నేడు మంత్రుల బృందం సంబంధిత అధికారులతో కలిసి వెళ్లి బాధితులకు చెక్కులు అందించారు.
విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ ( Gas leak tragedy ) అయిన ఘటనలో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంతో వారి మృతదేహాలతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు శనివారం ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ (LG polymers chemical plant) ఎదుట ఆందోళనకు దిగారు.
Vizag gas leak tragedy విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో మృతుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాతో పాటు అనారోగ్యం బారినపడి ఆస్పత్రిపాలైన వారికి అందించ నష్టపరిహారం కింద రూ. 30 కోట్లు విడుదల చేస్తూ ఏపీ సర్కార్ ( AP govt ) శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
విశాఖపట్నం జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు లీకేజ్ ( Chemical gas leakage ) అయిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. విషవాయువు చుట్టుముట్టడంతో ఊపిరాడక వందల మంది జనం తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది.
పంజాబ్‌లో విషాదం నెలకొంది. మొహాలిలో మూడంతస్తుల భవనం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద కొంత మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు .. వెంటనే NDRF సిబ్బంది రంగంలోకి దిగారు.
బీహార్‌లోని మోతీహర ప్రాంతంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో మంటలు చెలరేగి.. 27 మంది సజీవ దహనమయ్యారని సమాచారం. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.