Young Girl Letter To KTR: అధికారం కోల్పోయినా ప్రజల్లో మాత్రం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రతోపాటు కేటీఆర్ ప్రచార సభలకు కూడా ప్రజలు తరలివచ్చారు. కానీ ఓట్లు మాత్రం రాల్చలేదు. అధికారంలో లేకపోయినా ప్రజల్లో మధ్యనే ఉండడంతో ప్రజలు తమదైన రీతిలో అభిమానం చూపిస్తున్నారు. తాజాగా కేటీఆర్‌కు ఓ యువతి లేఖ రాసింది. ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Also Read: BRS Party MLAs: ఎంపీ కె కేశవరావు రాజీనామాతో 6 మంది ఎమ్మెల్యేలకు పదవీ గండం?
ఢిల్లీకి కేటీఆర్ గురువారం ప్రయాణం చేశారు. ప్రయాణ సమయంలో ఓ యువతి తారసపడింది. ఆ ప్రయాణంలో హైదరాబాద్‌కు చెందిన వినీల అనే యువతి కలిసింది. కేటీఆర్‌తో కలిసి క్షణాల్లోనే తన చేతిలో ఉన్న టిష్యూ పేపర్ (న్యాప్‌కిన్)పై చిన్న లేఖ రాసింది. ఈ లేఖలో కేటీఆర్‌పై వినీల ప్రశంసలు కురిపించింది. ఊహ తెలిసినప్పటి నుంచి కేటీఆర్ లాంటి గొప్ప రాజకీయ నాయకుడిని చూడలేదని పేర్కొంది. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్, తెలంగాణకు భారీ పరిశ్రమలు తీసుకొచ్చారని కొనియాడింది. తెలంగాణ, హైదరాబాద్‌వాసిగా గర్వపడుతున్నా అంటూ వినీల లేఖలో రాసింది. ఈ విషయాన్ని కేటీఆర్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.
Also Read: KCR Farmhouse: దిష్టిపోయింది.. ఇక అన్నీ మంచి శకునములే: మాజీ సీఎం కేసీఆర్
లేఖలో వినీల ఇలా రాసింది.. 'కేటీఆర్ సార్. మీరు నాకు ఎంత ఆదర్శప్రాయులే చెప్పలేను. మిమ్మల్ని ఒక్కసారి కలిస్తే చాలనుకున్నా. రాజకీయాలు తెలియనప్పటి నుంచే మిమ్మల్ని నేను అనుసరిస్తున్నా. మీరు ఎంతో ఉన్నత లక్ష్యాలతో ఉన్నా కూడా సామాన్యుడిలాగా జీవిస్తుంటారు. నేను చాలాసార్లు మీ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు కూడా చేశా. మీలాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆశిస్తున్నా' అని కేటీఆర్‌పై వినీల పొగడ్తల వర్షం కురిపించింది.
'బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, పట్టణాభివృద్ధి, విదేశీ పెట్టుబడులు, టీ హబ్, స్టార్టప్ సంస్కృతి వంటివి ఎన్నో చేశారు. లక్షలాది మంది ప్రజలకు మీరు ట్విటర్ ద్వారా చేరువవుతున్నారు. మా తరానికి ఆదర్శ నాయకుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం సాధించి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. హైదరాబాద్ ఉత్తమ నగరంగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నా' అంటూ వినీల లేఖ ముగించింది.
Motivation to keep going 🙏
So this young lady Vineela walks up to me as we landed in Delhi airport today evening, clicked a pic and handed this note that she scribbled on a paper napkin
Thanked her for her kind words and wished her a great future pic.twitter.com/PXtAklVfk4
— KTR (@KTRBRS) July 4, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter