Telugu States CMs Meet: రెండు రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్లు పూర్తయినా ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యలు కొలిక్కి రాలేదు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ జగన్‌లు చేసిన ప్రయత్నాలు కొంత సఫలీకృతం కాగా.. అనంతరం మళ్లీ భేదాభిప్రాయాలు రావడంతో విభజన సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఒకేపార్టీలో పని చేసిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టారు. గతంలో వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో తాజాగా వారు సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఆసక్తికరంగా మారింది.
Also Read: RTC Bus Deliver: డాక్టర్‌లా మారిన కండక్టర్.. ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మి పుట్టింది
ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేరుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్ (ప్రగతి భవన్)లో రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఏయే సమస్యలు ఉన్నాయి, ఆస్తుల విభజన, అప్పులు, నిధుల పంపకాలు వంటివి ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో సమావేశం పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
Also Read: Chalo TGPSC: పోలీస్ నిర్బంధాల మధ్య నిరుద్యోగుల టీజీపీఎస్సీ ముట్టడి సక్సెస్
ఎప్పుడు: జూలై 6 శనివారం
సమయం: సాయంత్రం 6 గంటలకు
వేదిక: హైదరాబాద్‌లోని ప్రజా భవన్ (ప్రగతి భవన్)
చర్చించే అంశాలు
- విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై గతంలో సీఎంలుగా కేసీఆర్, వైఎస్ జగన్ సమావేశమయ్యారు.
- ఆ తర్వాత తొలిసారి రేవంత్, చంద్రబాబు సమావేశమవుతుండడం ఇదే మొదటిసారి.
- షెడ్యూలు 9, షెడ్యూలు 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చ.
- విద్యుత్తు సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలు.
- దాదాపు రూ.24 వేల కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ తెలంగాణ తమకు చెల్లించాల్సిన రూ.7 వేల కోట్లపై ఏపీ అడిగే అవకాశం.
- ఉద్యోగుల విభజన.
- హైదరాబాద్, ఢిల్లీలో ఉన్న ఉమ్మడి ఆస్తులు
- ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి.
- షెడ్యూలు 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోం శాఖ షీలా బీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు లేకపోగా.. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
- పదో షెడ్యూలులో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్ విశ్వవిద్యాలయం వంటి 30 సంస్థల పంపిణీపై సమావేశంలో చర్చ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి