బస్సు కాలవలో పడి 37 మంది దుర్మరణం

పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Last Updated : Jan 30, 2018, 02:09 PM IST
బస్సు కాలవలో పడి 37 మంది దుర్మరణం

ముర్షీదాబాద్: పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బలిఘాట్ బ్రిడ్జి దాటుతుండగా బస్సు అదుపుతప్పి కిందనున్న కాలువలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో  37 మంది ప్రానీకులు మృత్యవాత పడ్డారు. వీరిలో 10 మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో బస్సులో 50మంది వరకు ప్రయాణిస్తున్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే హుటాహుటిన రెస్క్యూ టీం అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బస్సు ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయినవారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.  

Trending News