man bites back snake reptiles dies in bihar nawada: చాలా మంది వర్షాకాలంలో పాములకాటుకు గురౌతుంటారు. పాములు చెట్లు, పొదల నుంచి మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. ఎలుకలను పాములు ఇష్టంతో తింటాయి. దీనికోసం అవి పొలాల్లోకి, వడ్లు, ధాన్యం ఉన్న ప్రదేశాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలో.. కొన్నిసార్లు పాముల కాటుకు గురవ్వగానే..బాధితులు వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లిపోతుంటారు. మరికొందరు మాత్రం.. నన్నే కుడతావా అంటూ పాముమీద తమ శాడిజం చూయిస్తుంటారు. పామును కొట్టి చంపేస్తుంటారు. అంతేకాకుండా.. పామును కొరికే ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Read more: Snake bite: నాగు పాముకు చుక్కలు చూపించిన తాబేలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
పూర్తి వివరాలు..
బీహార్‌లోని నవాడా జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాజౌలిలో ఒక వ్యక్తిని కరిచిన పాము ప్రాణాలు కోల్పోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పాము కరిచిన వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు వార్తలలో నిలిచింది. నవాడాలోని రాజౌలి ప్రాంతంలో దట్టమైన అడవి మార్గంగుండా రైల్వే లైన్ ఉంది. సంతోష్ లోహర్(35) అనే వ్యక్తి రైల్వే కార్మికుడు గా పని చేస్తున్నాడు. డ్యూటీపూర్తి చేసుకుని రాత్రి భోజనం చేసిన తరువాత నిద్రపోయాడు. కాసేపటి తరువాత ఓ పాము వచ్చి అతన్ని కాటు వేసింది.
ఏదో కుట్టినట్లుగా, బలమైన నొప్పి రావడంతో వెంటనే లేచాడు లోహర్. చుట్టూ పక్కల చూసే సరికి పాము కనిపించింది. దీంతో షాక్ కు గురయ్యాడు. మొదట్లో భయపడిపోయిన కూడా.. ఆ తరువాత తేరుకుని పామును పట్టుకున్నాడు. తనను కరిచిన పాముపై ప్రతీకారంతో దాని నడుముపై రెండుసార్లు కొరికాడు. ఇంతలో అక్కడున్న వారు.. సంతోష్ లోహర్‌ను రాజౌలీ సబ్‌డివిజన్ ఆస్పత్రికి తరలించారు.
కరెక్ట్ టైమ్ లో.. బాధితుడు లోహర్ ను ఆస్పత్రికి చేర్చడంతో వైద్యులు అతనికి చికిత్స అందించారు. అతనికి ప్రాణాపాయం మాత్రం తప్పింది. మరుసటి రోజు ఉదయమే డిశ్చార్జ్ అయ్యాడని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. లోహర్‌ను కరిచిని పాము మాత్రం చనిపోయింది. అతను పాము నడుము మీద పలుమార్లు గట్టిగా కొరికాడు.దీని వెనుక ఏళ్లనాటి ఒక కథ ప్రచారంలో ఉందని చెబుతుంటారు.
Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..
జానపథ కథల ప్రకారం.. ఏదైనా పాము కాటువేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు ఆ పామును తిరిగి కొరకాలట. ఇలా చేయడం వల్ల శరీరంలోకి వచ్చిన విషం తిరిగి పాముకే ఎక్కుతుందట. అందుకే లోహర్ పాము తనను కాటు వేయగానే.. ఆ పామును పట్టుకుని రెండుసార్లు కొరికాడు. అలా కొరకడంతో తీవ్రంగా గాయపడిన పాము ప్రాణాలు కోల్పోయిందని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి