Cyclone Nisarga live updates నిసర్గ తుఫాన్ తీరాన్ని తాకింది. వాతావరణ శాఖ ( (IMD ) అంచనా వేసినట్టుగానే ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ 2.30 గంటల వరకు కొనసాగింది. అలీబాగ్కి సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో అరేబియా సముద్రం ( Arabia sea ) అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలజడితో తీర ప్రాంతాల్లో పలు చోట్ల అలలు 15-20 అడుగుల ఎత్తువరకు ఎగిసిపడుతున్నాయి.
Cyclone Nisarga నిసర్గ తుఫాను రేపు బుధవారం తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అలజడి సృష్టిస్తున్న నిసర్గ తుఫాన్ ( Cyclone Nisarga in Arabia sea ).. ముంబైకి 430 కిమీ దూరంలో, మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది (Cyclone Nisarga may landafll ).
రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. నైరుతి రుతుపవనాలు ఆశించినట్టుగానే జూన్ 1వ తేదీన కేరళను తాకాయి. రుతు పవనాల రాకతో కేరళలో రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ( IMD ) వెల్లడించింది. కేరళలోని కొయికోడ్ జిల్లాలో ( Kozhikode ) భారీ వర్షపాతం నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.