Road Marriage: పెళ్లి అనేది మనుషులకు జరిగే తంతు. అలా కాకుంటే జంతువులకు కూడా చేస్తుంటారు. కానీ రోడ్డుకు పెళ్లి జరిగింది. అదే కదా స్పెషల్.. రోడ్డుకు పెళ్లి జరిపి గ్రామస్తులంతా సామూహిక భోజనాలు చేయడం గమనార్హం.. రోడ్డు పెళ్లి కథ ఏమిటో చదవండి....
Burning Lorry Kerala: అగ్నిప్రమాదానికి గురైన ఓ లారీని.. కేరళకు చెందిన ఓ యువకుడు ప్రాణాలకు తెగించి లారీని నడిపాడు. జనావాసంలో ఉన్న ఆ లారీని ఓ ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి విడిచిపెట్టాడు. ఆ తర్వాత మంటలు ఆర్పేందుకు ఆ యువకుడు ప్రయత్నించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేరళలోని కోజికోడ్ ( Kozhikode ) విమానాశ్రయంలో గత వారం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కూలి ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం రెండుముక్కలైంది. ఈ విమాన ప్రమాదం తరువాత సహాయక చర్యల్లో అనేక మంది అధికారులతోపాటు స్థానికులు సైతం పాల్గొన్నారు.
కేరళలో ( Kerala ) జరిగిన కొజికోడ్ విమాన ప్రమాద దుర్ఘటనపై దర్యాప్తుకు కేరళ రాష్ట్రం రంగంలో దిగింది. ప్రమాద ఘటనపై విచారణ కోసం 30 మంది కేరళ పోలీసులతో ప్రత్యేక బృందాన్ని సిట్ ఏర్పాటు చేసింది.అటు ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB ) కూడా దర్యాప్తు చేస్తోంది.
కేరళ కొజికోడ్ ( Kozhikode ) విమాన దుర్ఘటన చర్చనీయాంశమే కాదు వివాదాస్పదమవుతోంది. విమాన దుర్ఘటనకు సివిల్ ఏవియేషన్ అధికార్ల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. పౌర విమానయాన సేఫ్టీ అడ్వైజరీ కమిటీ ( Civil aviation safety advisory committee member ) సభ్యుడు కెప్టెన్ మోహన్ రంగనాథన్ ఇదే చెబుతున్నారిప్పుడు..
కేరళలోని మలప్పురం జిల్లా కారిపూర్ ఎయిర్ పోర్టు రన్ వేపై శుక్రవారం రాత్రి జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో ( Air India flight crashed ) మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
కేరళలోని కోయికోడ్ ( Kozhikode ) లో జరిగిన ఎయిర్ ఇండియా ( Air India ) విమానం పై ప్రధాని మోదీ ( PM Modi ) ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం తనను కలచివేసింది అని , మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి అని.. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.