కేరళలోని కోజికోడ్ ( Kozhikode ) విమానాశ్రయంలో గత వారం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కూలి ఇద్దరు పైలెట్లతో సహా 18 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం రెండుముక్కలైంది. ఈ విమాన ప్రమాదం తరువాత సహాయక చర్యల్లో అనేక మంది అధికారులతోపాటు స్థానికులు సైతం పాల్గొన్నారు.
కేరళలో ( Kerala ) జరిగిన కొజికోడ్ విమాన ప్రమాద దుర్ఘటనపై దర్యాప్తుకు కేరళ రాష్ట్రం రంగంలో దిగింది. ప్రమాద ఘటనపై విచారణ కోసం 30 మంది కేరళ పోలీసులతో ప్రత్యేక బృందాన్ని సిట్ ఏర్పాటు చేసింది.అటు ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB ) కూడా దర్యాప్తు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.