Kozhikode plane Crash: ప్రత్యక సిట్ ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం

కేరళలో ( Kerala ) జరిగిన కొజికోడ్ విమాన ప్రమాద దుర్ఘటనపై దర్యాప్తుకు కేరళ రాష్ట్రం రంగంలో దిగింది. ప్రమాద ఘటనపై విచారణ  కోసం 30 మంది కేరళ పోలీసులతో ప్రత్యేక బృందాన్ని సిట్ ఏర్పాటు చేసింది.అటు ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB ) కూడా దర్యాప్తు చేస్తోంది.

Last Updated : Aug 10, 2020, 02:56 PM IST
Kozhikode plane Crash: ప్రత్యక సిట్ ఏర్పాటు చేసిన కేరళ ప్రభుత్వం

కేరళలో ( Kerala ) జరిగిన కొజికోడ్ విమాన ప్రమాద దుర్ఘటనపై దర్యాప్తుకు కేరళ రాష్ట్రం రంగంలో దిగింది. ప్రమాద ఘటనపై విచారణ  కోసం 30 మంది కేరళ పోలీసులతో ప్రత్యేక బృందాన్ని సిట్ ఏర్పాటు చేసింది.అటు ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB ) కూడా దర్యాప్తు చేస్తోంది.

కోజికోడ్ విమాన ప్రమాదం ( Kozhikode plane crash ).. అందర్నీ ఉలిక్కిపడేలా చేసిన దుర్ఘటన. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా 18 మంది ప్రాణాలు ( 18 dead in flight crash ) పోయాయి. దుబాయ్ నుంచి కొజికోడ్ ( Dubai to kozhikode )  వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ( Air India flight ) క్రాష్ ల్యాండింగ్ ( cross landing ) తో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నవిషయం తెలిసిందే. కొజికోడ్ లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ( karipur internatinal airport ) ఉన్న టేబుల్ టాప్ రన్ వే పై ల్యాండ్ అయ్యే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. 35 అడుగుల లోయలో పడిపోవడంతో విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై విచారించి నిగ్గు తేల్చేందుకు కేరళ ప్రభుత్వం 30 మంది రాష్ట్ర పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ( Special investigation team SIT ) ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ కు మలప్పురం ఏఎస్పీ జి సాబు నేతృత్వం వహించనున్నారు. ఈ ప్రమాదంలో మానవ తప్పిదం ఉందా లేదా అనేది సిట్ నిర్ధారించనుంది. 

ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఐఎస్ఎఫ్ అధికారి స్టేట్ మెంట్ ప్రకారం ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 337, 338, 304 ల కింద కేసు నమోదైంది. మరోవైపు ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ( AAIB ) దర్యాప్తు చేస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 190 మంది ప్రయాణికులు,సిబ్బంది ఉన్నారు. 18 మంది మరణించగా పలువురికి గాయాలయ్యాయి. గాయపడివారిలో 14 మంది పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. 

Trending News