Kerala Flight crash: ఆ రన్ వే సేఫ్ కాదని గతంలోనే హెచ్చరించారా

కేరళ కొజికోడ్ ( Kozhikode ) విమాన దుర్ఘటన చర్చనీయాంశమే కాదు వివాదాస్పదమవుతోంది. విమాన దుర్ఘటనకు సివిల్ ఏవియేషన్ అధికార్ల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. పౌర విమానయాన సేఫ్టీ అడ్వైజరీ కమిటీ ( Civil aviation safety advisory committee member ) సభ్యుడు కెప్టెన్ మోహన్ రంగనాథన్ ఇదే చెబుతున్నారిప్పుడు..

Last Updated : Aug 9, 2020, 07:14 PM IST
Kerala Flight crash: ఆ రన్ వే సేఫ్ కాదని గతంలోనే హెచ్చరించారా

కేరళ కొజికోడ్ ( Kozhikode ) విమాన దుర్ఘటన చర్చనీయాంశమే కాదు వివాదాస్పదమవుతోంది. విమాన దుర్ఘటనకు సివిల్ ఏవియేషన్ అధికార్ల నిర్లక్ష్యమే కారణమన్న విమర్శలు ఎక్కువవుతున్నాయి. పౌర విమానయాన సేఫ్టీ అడ్వైజరీ కమిటీ ( Civil aviation safety advisory committee member ) సభ్యుడు కెప్టెన్ మోహన్ రంగనాథన్ ఇదే చెబుతున్నారిప్పుడు.

“ కేరళ రాష్ట్రంలోని కొజికోడ్ లో ఉన్న కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ( karipur international airport ) రన్ వే నెంబర్ 10 ( Run way number 10 ). ఈ రన్ వే పై విమానాన్ని ల్యాండ్ చేయడమంటే ఆ విమానంలో ఉన్నవారందర్నీ ప్రమాదంలో పడేసినట్టే. ఇక్కడ ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే అతి సాధారణ ప్రమాదం ఎంతమాత్రం కాదు. అందరూ హత్యకు గురయ్యారని చెప్పాల్సి ఉంటుంది” ఈ వ్యాఖ్యలు చేసింది పౌర విమానయాన శాఖ సేఫ్టీ అడ్వైజరీ కమిటీ సభ్యుడైన మోహన్ రంగనాథన్ ( Mohan Ranganathan ). అందుకే ఇప్పుడీ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రమాదం జరగిన తరువాత కాదు..గతంలోనే అంటే 2011లోనే ఈ విషయమై అప్పటి పౌరవిమాన శాఖ కార్యదర్శిగా ఉన్న నసిమ్ జైదీకు చెప్పడమే కాకుండా స్పష్టమైన నివేదిక కూడా ఇచ్చినట్టు మోహన్ రంగనాథన్ అంటున్నారు. 

ఆ నివేదికను పట్టించుకోలేదని మోహన్ రంగనాథన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రన్ వే తడిగా ఉండి..భారీగా ఈదురుగాలులు వీస్తున్నప్పుడు నిమాన సిబ్బంది తప్పని పరిస్థితుల్లో ల్యాండింగ్ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏఎల్ఏఆర్ పరిస్థితులు అనుకూలంగా ఉండవంటున్నారు మోహన్ రంగనాథన్. ఏవియేషన్ అధికార్ల నిర్లక్ష్యమే ( Negligency of aviation department ) కారణమని..పదో నంబర్ రన్ వే జారుడు బండలా ఉంటుందని చెబుతున్నారు. అప్పటి నివేదికను పట్టించుకోకపోగా...అది భద్రమైనదని  కూడా ప్రకటించారని ఆందోళన వ్యక్తం చేశారు. Also read: Flight Crash: మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం, ప్రమాదంపై ఏఏఐ ఏమంటోంది ?

Trending News