Burning Lorry Kerala: అగ్నిప్రమాదానికి గురైన గడ్డివాము లారీ.. ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు!

Burning Lorry Kerala: అగ్నిప్రమాదానికి గురైన ఓ లారీని.. కేరళకు చెందిన ఓ యువకుడు ప్రాణాలకు తెగించి లారీని నడిపాడు. జనావాసంలో ఉన్న ఆ లారీని ఓ ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి విడిచిపెట్టాడు. ఆ తర్వాత మంటలు ఆర్పేందుకు ఆ యువకుడు ప్రయత్నించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 07:46 PM IST
    • సోషల్ మీడియాలో లారీ ఫైర్ యాక్సిడెంట్ వీడియో
    • ప్రాణాలకు తెగించిన డ్రైవ్ చేసిన యువకుడు
    • ప్రమాదాన్ని తప్పించిన యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు
Burning Lorry Kerala: అగ్నిప్రమాదానికి గురైన గడ్డివాము లారీ.. ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు!

Burning Lorry Kerala: అగ్నిప్రమాదాలు ప్రదేశాల్లో సాధారణంగా జనాలు దాని నుంచి దూరంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగు తీస్తుంటారు. అయితే ఇలాంటి ఓ సంఘటన కేరళలో జరిగింది. సమయస్ఫూర్తితో ఆలోచించి.. మంటలను అదుపు చేసేందుకు తన వంతుగా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంతో రియల్ హీరోగా నిలిచాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఏం జరిగిందంటే?

కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో ఆదివారం రాత్రి పశువులు తినే గడ్డి లోడ్ ను ఓ లారీలో తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఆ లారీ పైన ఉన్న విద్యుత్ తీగలను తాకింది. వయనాడ్‌ నుంచి కొడంచేరికి చేరుకునే సమయంలో మంటలు లారీలోని గడ్డి మొత్తానికి చుట్టుముట్టాయి. 

అయితే ఆ లారీలో మంటలు చెలరేగడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలు దూరంగా వెళ్లారు. కానీ, ఓ వ్యక్తి తన ప్రాణాలకు తెగించి.. ఆ ప్రమాదాన్ని ఆపేందుకు కృషి చేశాడు. ప్రాణాలకు తెగించి చేసిన ఆ ప్రయత్నంలో నిజమైన హీరోగా నిలిచాడు. అగ్నిప్రమాదం చోటుచేసుకున్న లారీని ఏ మాత్రం బెదరకుండా.. జనావాసం నుంచి దూరంగా తీసుకెళ్లి.. ఓ ఖాళీ ప్రదేశంలో వదిలేశాడు. 

అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునే లోగా.. ఆ యువకుడితో పాటు స్థానికులు మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి.  

Also Read: Is Mia Khalifa Dead?: పోర్న్ స్టార్ మియా ఖలీఫా మృతి?.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్!

ALso Read: Girls Google Searching: 17 శాతం మంది అమ్మాయిలు ఇంటర్నెట్ లో సెక్స్ గురించి సెర్చ్ చేస్తున్నారట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News