బద్ధ శత్రువులు చేతులు కలిపిన వేళ

                                

Last Updated : Apr 27, 2018, 01:23 PM IST
బద్ధ శత్రువులు చేతులు కలిపిన వేళ

ఆ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని పరిస్థితి..మొన్నటి వరకు యుద్ధసన్నాహాల మధ్య మునిగి తేలారు. యుద్ధం అనివార్యమని అంతా భావించారు. చర్చల ఫలింతంగా యుద్ధానికి దారి తీయాల్సిన పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పరస్పర సహకారం కోసం ముందుకొచ్చారు.. ఇంతకీ ఎవరి గురించి అనుకుంటున్నారా..వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది.

 బద్ధశత్రువులగా ఉన్న ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్, దక్షిణ కొరియా ఆ దేశాధ్యక్షుడు మూన్ జే చేతులు కలిపారు.  రెండు దేశాలను విభజించే సైనిక సరిహద్దు రేఖను దాటిన కిమ్.. మూన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. స్నేహహస్తం కోసం అన్ని పక్కనపెట్టి మూన్ జే ముందడుగు వేశారు. చారిత్రక సదస్సు ముందు చిరకాల ప్రత్యర్థులు ఇద్దరు శుక్రవారం చేతులు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొరియా యుద్ధం ముగిసిన 65 ఏళ్ల తర్వాత ఇరు దేశాల నేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇలా దక్షిణ  కొరియాలో అడుగుపెట్టి ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 

అంతర్జాతీయ సదస్సు కోసం పన్ముంజోమ్‌లోని ట్రూస్ గ్రామంలో నిర్మిస్తున్న ‘పీస్ హౌస్ బిల్డింగ్’ను ఇద్దరు నేతలు సందర్శించిన అనంతరం కిమ్  సరిహద్దు దాటి పొరుగుగడ్డపై అడుగుపెట్టారు. అణ్వాయుధ ప్రయోగాలకు స్వస్తి చెప్పనున్నట్టు కిమ్ ప్రకటించిన తర్వాత జరిగిన అతిపెద్ద వార్త ఇదేనని నిపుణులు చెబుతున్నారు. రెండు కొరియా దేశాల మధ్య శాంతి నెలకొనడంతో బంధం మరింత బలపడేలా కిమ్ జాంగ్ ఉన్ తో మూన్ జే  నిర్మాణాత్మకమైన చర్చలు జరుపుతారని ఉత్తర కొరియా ప్రకటించింది.

శత్రుత్వాన్ని వీడి ఉత్తర కొరియా దేశాలు ఏకమైమవడంతో ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయి. భారత్ - పాక్ దేశాలు కూడా నిర్మాత్మకమైన చర్చలు ప్రారంభించాల్సిన ఆవశ్యకత ఉందని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఉగ్ర భావాజాలాన్ని వీడితే పాక్ తో స్నేహస్తం కోసం రెడీ అంటోంది భారత్.. కానీ పాక్ ఉగ్ర భావజాన్ని వీడిందుకు సిద్ధంగా లేకపోవడం విచారకరమైన మేధావులు అభిప్రాయడుతున్నారు.

Trending News