KCR Press Meet: 'కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిని వెలిగించడానికి రాదా?' రేవంత్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

KCR Sensational Comments On Revanth Reddy: తాము అధికారం కోల్పోయిన మూడు నెలలకే తెలంగాణ ఎండిపోతుందని.. దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయని కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డిపై కేసీఆర్‌ విరుచుకుపడ్డారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 31, 2024, 05:50 PM IST
KCR Press Meet: 'కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిని వెలిగించడానికి రాదా?' రేవంత్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

KCR Speech: 'రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రైతుల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. తీవ్ర దుర్భిత పరిస్థితులు ఉన్నాయి' అని మాజీ సీఎం కేసీఆర్‌ తెలిపారు. 'కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి. దాన్ని నడిపించే తెలివి కూడా లేదా?' అని మండిపడ్డారు. 'ప్రస్తుతం అధికారంలో ఉన్న వారి తెలివితక్కువతనం.. అర్భకత్వం ప్రస్తుతం పాలిస్తున్న పార్టీది' అని విమర్శించారు. ఉన్న విద్యుత్‌, మిషన్‌ భగీరథను వాడుకునే తెలివి లేదు. వాటర్‌ ట్యాంకర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు మళ్లీ వస్తున్నాయి. అసమర్ధ, అవివేక ప్రభుత్వంగా అభివర్ణించారు.

జనగామ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటపొలాలను కేసీఆర్‌ ఆదివారం పరిశీలించారు. అనంతరం సూర్యాపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రైతు బాగు కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కొన్ని స్పష్టమైన విధానాలు తీసుకుని చర్యలు చేపట్టాం. రైతులకు అనేక పద్ధతుల నీరు సరఫరా చేశాం. రెతుబంధుతో రైతులకు సమయానికి పెట్టుబడి సహాయం అందించాం. మూడోది సాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ అందజేయడం, నాలుగోది ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి పంటలను కొనుగోలు చేయడం, ఐదోది రైతులకు అనుకోనది ఏదైనా సంభవిస్తే రైతుబీమా అందించాం' వంటివి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందని కేసీఆర్‌ వివరించారు.

వంద రోజుల్లోనే ఇంతటి దారుణ పరిస్థితులు రావడం ఏమిటిది? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. 'దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్పకాలంలోనే ఈ దుస్థితికి ఎందుకు రావాలి? అని సందేహం వ్యక్తం చేశారు. 'నీళ్లు ఇస్తారని నమ్మి పంటలు వేసుకున్నాం.. ముందే చెబితే వేసుకునేవాళ్లం కాదని రైతులు చెబుతున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు అనుకూల విధానాలు చేపట్టింది. రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం అందించాం. ప్రపంచమే మెచ్చిన మిషన్‌ భగీరథ నిర్వహణలో లోపాలు ఎందుకు వస్తున్నాయి?' అని ప్రశ్నించారు.

'మా హయాంలో బిందె పట్టుకుని ఏ ఆడబిడ్డ కూడా కనిపించలేదు. ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు కనిపించలేదు. ఇవాళ హైదరాబాద్‌లో కూడా నీళ్ల ట్యాంకర్లు కూడా ఎందుకు కనిపిస్తున్నాయి? అప్పట్లో కరెంట్‌ పోతే వార్త. ఇప్పుడు ఉంటే వార్త. అగ్రగామి రాష్ట్రానికి ఎందుకు చెదలు పట్టింది' అని నిలదీశారు. అసమర్ధత, అలసత్వం కారణంగానే ఈ దుస్థితి తలెత్తిందని రేవంత్‌ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

రైతులకు భరోసా
రాష్ట్రంలో దెబ్బతిన్న పంట పొలాలను జనగామ, సూర్యాపేట జిల్లాల్లో కేసీఆర్‌ పర్యటించారు. నీళ్లు లేక పంట నష్టపోయి దిగాలు పడుతున్న రైతులకు అండగా నిలిచారు. ఎండిన వరి, మొక్కజొన్న తదితర పంటల రైతులతో మాట్లాడారు. వారికి భరోసానిచ్చారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నీళ్లు ఇచ్చే తెలివి లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వంపై పోరాడి పంట నష్టపరిహారం తీసుకుందామని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News