Job Mela in Vizianagaram: ఏపీలోని పలు జిల్లాల్లో ప్రభుత్వం జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఈ నెల 18న విజయనగరం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించే ఈ మేళాలో వివిధ ప్రైవేట్ సంస్థలు పాల్గొననున్నాయి.
TS PECET 2021 results declared: పీఈ సెట్ పరీక్షలకు హాజరైన వారిలో 96.99 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. ఈ పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,994 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు.
IBPS declares CRP RRB X office assistant (clerk) prelims results 2021: ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమినరి ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు ఐబిపీఎస్ అధికారిక వెబ్సైట్లో ibps.in తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
Income Tax Jobs 2021: ఇన్ కం ట్యాక్స్ డిఫార్ట్ మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించారు.
Junior civil judges posts recruitment in AP: అమరావతి: రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉండగా.. అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 18 పోస్టులు, బదిలీ విధానం ద్వారా మరో 4 పోస్టులు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
YS Sharmila speech at Nirudyoga nirahara deeksha: ఖమ్మం: నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. 54 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. కేవలం 7 ఏళ్లలో నిరుద్యోగం 4 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగం (Unemployment) పెరగడానికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరే కారణం అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
ICMR Recruitment 2021: జూన్ 25వ తేదీలోగా అభ్యర్థులు రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR Jobs 2021) పేర్కొంది. ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్-2 పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్-3 పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (నాన్ మెడికల్ విభాగం) 70 ఏళ్లు గరిష్ట పరిమితిగా నిర్ణయించారు.
Akshara Trailer and Akshara release date: టైటిలర్ క్యారెక్టర్లో నందితా శ్వేత నటించిన అక్షర మూవీ ట్రైలర్ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థ ఎలా వ్యాపారమైందనే కోణంలో సినిమా కథాంశం ఉండనున్నట్టు అక్షర ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
Who Is Eligible For EWS Certificate: అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మరోసారి ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై చర్చ మొదలైంది. అయితే ఎవరెవరికి EWS Reservations వర్తిస్తాయో తెలుసుకోండి.
EWS Reservations In Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) ఇకనుంచి పది శాతం రిజర్వేషన్ అమలు కానుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలవుతాయని సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు.
Apply Online for 2296 AP Gramin Dak Sevak Posts: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ఇండియన్ పోస్టాఫీసు శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,296 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
India Post GDS Recruitment 2021: భారతీయ పోస్టల్ శాఖ గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా 1150 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయడంలో భాగంగా ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని సర్కిల్స్‌లో ఖాళీలను భర్తీ చేయనుంది.
Singareni Recruitment 2021: How To Apply For Singareni Jobs: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ శుభవార్త అందించింది. మొత్తం 651 ఖాళీలు ఉండగా.. ప్రస్తుతం తొలి విడత నోటిఫికేషన్లో 372 ట్రైనీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.
EWS Reservation In Telangana: రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్లు ఉన్నాయని తెలిసిందే.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అతిపెద్ద నోటిఫికేషన్ వచ్చేసింది. నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2020' నోటిఫికేషన్‌ను ఎస్ఎస్సీ విడుదల చేసింది. మొత్తం 6,506 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది.
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఉద్యోగులు వద్దు మొర్రో అన్నా వారికి పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. కొన్ని కంపెనీలు సాధ్యమైనంత వరకు ఉద్యోగులను తొలగించి, ఖర్చుల భారం తగ్గించుకున్నాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా మీకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయంటే ఓసారి ఆలోచించాల్సిందే..
IDBI Bank SO Recruitment 2020: ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) నిరుద్యోగులకు, కొత్త జాబ్ కోసం ఎదురుచూస్తున్న వారికి సైతం శుభవార్త చెప్పింది. 134 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది ఐడీబీఐ.
AP DSC Teacher Posts: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పనుంది. ఇప్పటికే లక్షకు పైగా పోస్టులు భర్తీ చేసిన సర్కార్.. ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉపాధ్యాయ పోస్టుల బదిలీలు, బ్యాక్లాగ్ పోస్టులు, ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.