ICMR Recruitment 2021: మెడికల్ పోస్టులకు ఐసీఎంఆర్ జాబ్ నోటిఫికేషన్, గరిష్టంగా రూ.1 లక్ష వరకు జీతం

ICMR Recruitment 2021: జూన్ 25వ తేదీలోగా అభ్యర్థులు రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR Jobs 2021) పేర్కొంది. ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్-2 పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్-3 పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (నాన్ మెడికల్ విభాగం) 70 ఏళ్లు గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Jun 13, 2021, 12:16 PM IST
ICMR Recruitment 2021: మెడికల్ పోస్టులకు ఐసీఎంఆర్ జాబ్ నోటిఫికేషన్, గరిష్టంగా రూ.1 లక్ష వరకు జీతం

ICMR Recruitment 2021: దేశంలోని అత్యున్నత వైద్య సంస్థలలో ఒకటైన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మెడిసిన్ విభాగంలో కొన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ 2, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (నాన్ మెడికల్ పోస్టులు) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించింది.

జూన్ 25వ తేదీలోగా అభ్యర్థులు రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR Jobs 2021) పేర్కొంది. ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్-2 పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్-3 పోస్టులకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (నాన్ మెడికల్ విభాగం) 70 ఏళ్లు గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. 

Also Read: IBPS RRB Notification 2021: 10,493 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్, నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

పోస్టుల వివరాలు
ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్-2 - 1 పోస్ట్
ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్-3 - 1 పోస్ట్
ప్రాజెక్ట్ కన్సల్సెంట్ (నాన్ మెడికల్) - 1 పోస్ట్ 
ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్-2 వేతనం - ఎంపికైన వారికి ప్రతినెలా రూ.64,000
ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్-3 వేతనం - రూ.54,000 + HRA
ప్రాజెక్ట్ కన్సల్సెంట్ (నాన్ మెడికల్) వేతనం - అనుభవం, నాలెడ్జ్ ఆధారంగా గరిష్టంగా రూ.1,00,000 వరకు చెల్లించనున్నారు.

Also Read: Salary Hike 2021-22: ఈ సంవత్సరం భారత్‌లో ఉద్యోగులకు ఎక్కువ జీతం, రెండంకెల increment, పూర్తి వివరాలు

అర్హతలు:
Official Website Of ICMR ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్-2 - ఎంబీబీఎస్ ఒక ఏడాది అనుభవం తరువాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (MD/MS/DNB) పూర్తి చేసి ఉండాలి లేదా ఎంబీబీఎస్ నాలుగేళ్లు, నాలుగేళ్ల ప్రాజెక్ట్ తరువాత మెడికల్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లోమా

ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్-3 - MPH / MS / M.Pharma / MTech లతో ఏదైనా ఒక రీసెర్చ్ పేపర్
ప్రాజెక్ట్ కన్సల్సెంట్ (నాన్ మెడికల్) - లైఫ్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ, తగిన అనుభవం. ప్రముఖ జర్నల్స్‌లో రిపోర్ట్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News