Telangana CM KCR Announces 10 Percent Reservation For EWS: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు వారి రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగిస్తూనే, రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ(Telangana) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read: IRCTC: రైలు టికెట్లపై 10 శాతం డిస్కౌంట్.. ఎలాగో తెలుసా!
రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. అయితే అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాలలో న్యాయం చేయడంలో భాగంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. తాజాగా అందించనున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలవుతాయని సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు.
Also Read: Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి ధరల జోరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook