AP Jobs 2020: నిరుద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ శుభవార్త!

AP DSC Teacher Posts: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పనుంది. ఇప్పటికే లక్షకు పైగా పోస్టులు భర్తీ చేసిన సర్కార్.. ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉపాధ్యాయ పోస్టుల బదిలీలు, బ్యాక్‌లాగ్ పోస్టులు, ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తోంది.

Last Updated : Dec 25, 2020, 07:40 AM IST
  • నిరుద్యోగులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పనుంది
  • ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం
  • తాజాగా వేలాది పోస్టుల భర్తీకి కసరత్తులు మొదలుపెట్టిన విద్యాశాఖ
AP Jobs 2020: నిరుద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ శుభవార్త!

AP DSC Teacher Posts: రాష్ట్రంలోని నిరుద్యోగులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పనుంది. ఇప్పటికే లక్షకు పైగా పోస్టులు భర్తీ చేసిన సర్కార్.. ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉపాధ్యాయ పోస్టుల బదిలీలు, బ్యాక్‌లాగ్ పోస్టులు, ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తోంది. అయితే తొలుత బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేసేందుకు లిమిటెడ్ డీఎస్సీని నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.

బ్యాక్‌లాగ్ పోస్టులను జిల్లాలవారీగా ఖాళీల వివరాలు తేలిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాదాపు 400 వరకు బ్యాక్‌లాగ్ పోస్టులు (Jobs 2020) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ తర్వాత ఏమైనా ఖాళీలు ఉంటే వాటితో కలిపి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌లో అన్ని పోస్టులను భర్తీ చేయాలని వైఎస్ జగన్ సర్కార్ యోచిస్తోంది. 

Also Read: AP: స్థానిక సంస్థల సంస్కరణల్లో ఏపీ, ఎంపీలే టాప్..కేంద్రం ప్రశంసలు

కరోనా వైరస్ (CoronaVirus) వ్యాప్తి సమస్య లేకపోతే ఇప్పటికే బ్యాక్‌లాగ్ పోస్టులను సర్కార్ భర్తీ చేసేది. గతంలో ఇచ్చిన స్పెషల్ డీఎస్సీ తర్వాత సైతం కొన్ని ఖాళీలు (AP DSC Teacher Posts) భర్తీ కాలేదని తెలిసిందే. బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసిన తర్వాతే టెట్ నిర్వహించనున్నారు. అనంతరం రెగ్యులర్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపీ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు, ఇంగ్లీష్ మీడియం లాంటి నిర్ణయాలతో ముందుకుసాగుతున్నందున టెట్ సిలబస్‌లో సైతం మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Also Read: Amazon Fab Phones Fest: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ బంపర్ ఆఫర్లు ఇవే..

ఏపీ (Andhra Pradesh)లో నిరుద్యోగులు సైతం టీచర్ పోస్టులను భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్‌కు, అధికారులకు విన్నవించుకుంటున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా నోటిఫికేషన్లకు బ్రేక్ పడిందని, లేకపోతే ఇదివరకే బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీని పూర్తి అయ్యేదని చెబుతున్నారు. కరోనా ప్రభావం మరింత తగ్గితే సాధ్యమైనంత త్వరగా పది వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది.

Also Read: YS Jagan Birthday: రక్తదానంలో వైఎస్ఆర్‌సీపీ వ‌ర‌ల్డ్ రికార్డ్‌!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News