Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం జరగబోతోందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలన్ని పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యమంటున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మార్చిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పొత్తులపై కీలక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామన్నారు.
Power Cut In Pawan Kalyan Press Meet: మంగళగిరి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన అనంతరం రాత్రికి ఏపీలోని మంగళగిరికి చేరుకున్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు.
Pawan Kalyan: పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ టూర్లో జనసేన శ్రేణుల జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు.
Pawan Kalyan visit : ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణలో కూడా పర్యటించనున్నారు. ఈ మేరకు ఆపార్టీ నుంచి అధికార ప్రకటన వెలువడింది.
Ugadi 2022 Panchamgam on Pawan Kalyan. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుల పొలిటికల్ కెరీర్లో చాలా హైప్ అనేది ఏమీ ఉండదని జోతిష్య నిపుణులు పాలెపు రాజేశ్వర శర్మ తెలిపారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ అట్టహాసంగా జరుగుతోంది. జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాపాకకి సభలో ఎంట్రీ లేదంటూ పోస్టర్లు వెలిశాయి. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన పార్టీ ప్రజలతోనే ఉంటుందని, ప్రజల కన్నీళ్లు తుడవటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో బుధవారం నాడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
Tirupati by polls: తిరుపతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. అప్పటివరకు క్యూలో నిల్చున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఇచ్చారు. చివర్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్యలో కరోనావైరస్తో బాధపడుతున్న పేషంట్స్‌కు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.
Pawan Kalyan comments on CM post: తిరుపతి: తనకు సీఎం పదవిపై ఆశ లేదని.. సీఎం కాకపోయినా సేవ చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం అయితేనే అని కాదు.. కాకపోయినా సరే ఇంకా ఎక్కువ సేవే చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. సామాన్యులపై అధికార పార్టీ (YSRCP) ప్రతాపం చూపిస్తోందని మండిపడ్డారు.
Pawan Kalyan in Tirumala temple: తిరుమల: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక ఆధ్యాత్మికవేత్త అవతారంలో కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ శ్రీవారిని దర్శించుకోగా.. ఎప్పటికంటే భిన్నంగా ఈసారి ఆయన కంటే ఆయన ధరించిన దుస్తులే సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ అయ్యాయి.
KA Paul comments on Pawan Kalyan | తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించిన తర్వాత ఎమ్మెల్యేగా కానీ లేదా ఎంపీగా కానీ గెలవకుండానే ఏడు పార్టీలు మారారంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో వేడి రాజేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ కామెంట్లపై తాజాగా సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ (Bandla Ganesh) ఫైర్ అయ్యారు.
జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన తీసుకున్న నిర్ణయంపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో మరింత వేడిని రాజేశాయి. తాజాగా నాగబాబు చేసిన కామెంట్లపై ప్రకాష్ రాజ్ మళ్లీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ విషయమై తప్పటడుగులు వేసిన జనసేన..ఇకపై కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. తిరుపతి సీటును కోరుతూ బీజేపీ ముందు ప్రతిపాదన ఉంచనుంది.
దుబ్బాక మగిసింది. దేశంలో ఉప ఎన్నికలు, బీహార్ ఎన్నికలూ ముగిశాయి. ఇప్పుడందరి దృష్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైనే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందంటూ పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన వెలువరించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.