Pawan Kalyan Press Meet: పవన్ కళ్యాణ్ ఇష్టాగోష్టిలో కరెంట్ కట్.. మొబైల్ లైట్ల వెలుగులో ప్రోగ్రాం, ఫోటోలు వైరల్

Power Cut In Pawan Kalyan Press Meet: మంగళగిరి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన అనంతరం రాత్రికి ఏపీలోని మంగళగిరికి చేరుకున్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. 

Power Cut In Pawan Kalyan Press Meet: మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టిలో మాట్లాడుతున్న సందర్భంలోనే ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతున్న సమయంలోనే కరెంటు పోయింది.

1 /5

Power Cut In Pawan Kalyan Press Meet: ఇప్పటికే ఇటీవల కాలంలో ఏపీ సర్కారుపై విమర్శలు తీవ్రతరం చేసిన పవన్ కళ్యాణ్‌కి సరిగ్గా సమయానికి ఓ మంచి అస్త్రం లభించినట్టయింది.

2 /5

Power Cut during Pawan Kalyan Press Meet: ఆంధ్ర ప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై గత కొంత కాలంగా తీవ్ర విమర్శలు వస్తుండటంతో పాటు సోషల్ మీడియాలోనూ పలు మీమ్స్ ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే.

3 /5

Power Cut In Pawan Kalyan Press Meet: ఇలాంటి తరుణంలోనే ఇలా పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో ఇష్టాగోష్టిలో ఉండగా విద్యుత్ సరఫరా పోవడంతో ఆయన ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూనే ఇదిగో ఇలా ఫోన్ల లైట్ల వెలుగులో మాట్లాడారు.

4 /5

Power Cut In Pawan Kalyan Press Meet: కరెంట్ పోవడంతో పవన్ కళ్యాణ్ ఇలా సెల్ ఫోన్ల లైట్ల వెలుతురులో మీడియా మిత్రులతో మాట్లాడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

5 /5

Power Cut In Pawan Kalyan Press Meet: నెటిజెన్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఈ ఫోటోల కింద కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.