Bandla Ganesh comments on Prakash Raj: హైదరాబాద్: జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీసుకున్న నిర్ణయంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో వేడి రాజేసిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్‌ను ఊసరవెల్లి అంటూ ప్రకాష్ రాజ్.. చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రంగా ఫైర్ అయ్యారు. నాగబాబు భాష తనకు రాదంటూ ప్రకాష్ రాజ్ ( Prakash Raj ) కౌంటర్ కూడా ఇచ్చారు. ఇంతటితో ఆగిందనకున్న ఈ వివాదం.. మళ్లీ రాజుకుంది. ప్రకాష్ రాజ్ కామెంట్లపై తాజాగా సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ ( Bandla Ganesh ) ఫైర్ అయ్యారు. ఎలక్షన్స్ టైమ్‌లో మాట్లాడటం ఎందుకని ఏం మాట్లాడలేదు.. నా దేవుడిని ఏమైనా అంటే అస్సలు సహించేది లేదంటూ.. ప్రకాష్ రాజ్‌ని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ వరుసగా ట్వీట్స్ చేశారు. Also Read: Prakash Raj: నాకు మీ భాష రాదు.. నాగబాబుకి స్ట్రాంగ్ కౌంటర్
నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన బిక్ష @PawanKalyan @prakashraaj
— BANDLA GANESH. (@ganeshbandla) December 1, 2020
‘‘ఎలక్షన్ టైం లో మాట్లాడటం ధర్మం కాదని రాజకీయాలు మాట్లాడకూడదని నేనేం మాట్లాడలేదు నేను ఒకటి మాత్రం చెప్తున్నా..
నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. ఆయన వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత నాకు తెలుసు.
పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కానీ వ్యక్తిత్వం గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను. పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం.
ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు, ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్‌ది.
నిజాయితీకి నిలువుటద్దం పవన్ కళ్యాణ్.
నాకు కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది.
నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన భిక్ష’’ అంటూ ప్రకాష్ రాజ్‌ని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ వరుస ట్వీట్స్ చేశారు.
Also read: Telangana: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Also read: Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe