భారత్‌లో కరోనా వైరస్ ( coronavirus ) వ్యాప్తి రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు అమర్నాథ్ దేవస్థానం బోర్డు ప్రకటించింది.
Terrorists attacks: న్యూ ఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రవాదులు పుల్వామా తరహాలో మరో దాడికి పాల్పడే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు చేసిన హెచ్చరికల నేపథ్యంలో కశ్మీర్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పుల్వామా తరహాలో దాడికి పాల్పడేందుకు కుట్ర పన్నుతున్న లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఇప్పటికే ఈ విధ్వంసానికి సంబంధించి రెక్కీ ( Recce) కూడా పూర్తి చేసినట్టు నిఘావర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది.
సమాచారం ఇవ్వాలంటే ఇప్పుడు చాలా సాధనాలు ఉన్నాయి. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఈ- మెయిల్స్, ఇంటర్నెట్, ఫేస్ బుక్..ఇలాంటి సాధనాలతో ఇప్పుడు సమాచారం ఒకరి నుంచి ఒకరు పంపించుకోవడం చాలా సులభమైంది.
కశ్మీర్లో 2019, ఆగస్టు 5న ఆర్టికల్ 370 తొలగించిన సందర్భంలో కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవడం, పలు చోట్ల ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు హింసకు దారితీయడం తెలిసిందే. అయితే, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి ఇప్పటికే 7 నెలల పూర్తయింది. అక్కడ విధించిన పలు ఆంక్షలను సైతం కేంద్రం క్రమక్రమంగా ఎత్తివేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంది ? ప్రస్తుత పరిస్థితిపై కశ్మీరీలు ఏమంటున్నారు ? ఆర్టికల్ 370 రద్దు తర్వాత వారి జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా ? ఆందోళనకారులు చెప్పినట్టుగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు మా జీ టీవీ
జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులై నేటికి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో వారి స్మరణార్థం లెత్పోరాలో స్మారకస్తూపాన్ని ఏర్పాటు చేశారు.
ఆగస్టు 5న నిలిపివేసిన ఇంటర్ నెట్ సేవలు కశ్మీర్ ప్రజలకు నేడు అందుబాటులోకి వచ్చాయి. అయితే 2జీ స్పీడుతో పోస్ట్ పెయిడ్, ప్రి పెయిడ్ మొబైల్ యూజర్స్ అందరికీ సేవల్ని పునరుద్ధరించారు.
VK Saraswat on Kashmir People: జమ్మూలో ఇంటర్నెట్ ఎందుకోసం వాడతారో తెలుసా అంటూ నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అక్కడి యువత డర్టీ మూవీస్ (బూతు సినిమాలు) చూసేందుకే ఇంటర్నెట్ వినియోగిస్తుందన్నారు.
జమ్మూకాశ్మీర్‌లో గత శనివారం (జనవరి 11న) ఓ డీఎస్పీతో పాటు ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హిజ్బుల్ ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.