పావురాలతో రాయబారం..!!

సమాచారం ఇవ్వాలంటే ఇప్పుడు చాలా సాధనాలు ఉన్నాయి. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఈ- మెయిల్స్, ఇంటర్నెట్, ఫేస్ బుక్..ఇలాంటి సాధనాలతో ఇప్పుడు సమాచారం ఒకరి నుంచి ఒకరు పంపించుకోవడం చాలా సులభమైంది. 

Last Updated : May 25, 2020, 02:48 PM IST
పావురాలతో రాయబారం..!!

సమాచారం ఇవ్వాలంటే ఇప్పుడు చాలా సాధనాలు ఉన్నాయి. సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఈ- మెయిల్స్, ఇంటర్నెట్, ఫేస్ బుక్..ఇలాంటి సాధనాలతో ఇప్పుడు సమాచారం ఒకరి నుంచి ఒకరు పంపించుకోవడం చాలా సులభమైంది. 

కానీ పురాతన కాలంలో ఎవరికైనా సమాచారం ఇవ్వాలంటే.. చాలా  కష్టంగా ఉండేది.  కచ్చితంగా ఓ మనిషి వెళ్లాల్సి వచ్చేది. లేదా పావురాలతో రాయబారం పంపేవారు. మళ్లీ ఇప్పుడు అదే కాలం వచ్చినట్లు కనిపిస్తోంది. ఐతే సాధారణ ప్రజలు మాత్రం ఇలాంటి వ్యవస్థను ఉపయోగించడం లేదు. 

నిజానికి సాధారణ పౌరులకు అలాంటి అవసరం కూడా లేదు. ఇలాంటి  పావురాల రాయబారం ఉపయోగిస్తున్నారంటే కచ్చితంగా అసాంఘీక  పనులు ఏవో చేస్తూ ఉన్నట్లే లెక్క. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో అదే భయం నెలకొంది. ఉగ్రమూకలు లేదా పాకిస్తాన్ గూఢచారులు  ఈ పావురాల  రాయబారం నడుపుతున్నట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ సరిహద్దుకు అతిసమీపంలో ఉన్న కథువా జిల్లాలో ఓ పావురాన్ని స్థానికులు బంధించారు. దాని కాలికి ఓ ఉంగరం ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పావురాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని ఓ పంజరంలో బంధించారు. దాని కాలికి ఉన్న ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉంగరంపై కొన్ని నంబర్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని కథువా జిల్లా ఎస్ఎస్పీ శైలేంద్ర మిశ్రా తెలిపారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు తెలియడం లేదన్నారు. త్వరలోనే దీన్ని ఛేదిస్తామని చెప్పుకొచ్చారు. 

బహుశా ఉగ్రవాదులు లేదా పాకిస్తాన్ గూఢచారులు ఇలాంటి ప్రయత్నం చేసి ఉంటారనే చర్చ స్థానికంగా జరుగుతోంది. ఐతే పోలీసుల విచారణ పూర్తయితే నిజానిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News